అయిజ రూరల్, మార్చి 28 : మండలంలోని కిష్టాపురానికి చెందిన 94 ఏండ్ల వృద్ధాప్య మహిళ తనకు పింఛన్ ఇప్పించండి మహా ప్రభు అంటూ వేడుకుంటున్నది. వివరాలలోకి వెళితే మండలంలోని కిష్టాపురం గ్రామానికి చెందిన నాగేశ్వరమ్మ(98) తనకు పింఛన్ రావ డం లేదని బోరున విలపించింది.
గతంలో తన భర్తకు పింఛన్ వచ్చేదని దాంతోనే ఇద్ద రం కాలం గడిపే వాళ్లమని చెప్పారు. తన భర్త మర ణించి మూడేండ్లు అయినా తనకు ఇంతవరకు పింఛన్ మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నడవలేని స్థితిలో అధికారుల చుట్టూ తిరుగుతున్నా తనను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉన్నతాధికారులైనా స్పందించి తనకు పింఛన్ వచ్చేలా చూడాలని వేడుకుంటున్నది.