ఆయిల్‌పాం గెలల సేకరణ
రైతులు పండించిన ఆయిల్ పాం గెలలను టీజీ ఆయిల్ సీడ్ కంపెనీ సేకరిస్తోంది. అయిజ మండలంతోపాటు వడ్డేపల్లి, రాజోళి, గట్టు, మల్దకల్ తదితర మండలాలకు చెందిన ఆయిల్ పాం తోటల పెంపకం దారుల నుంచి ఆయిల్ పామ్ గెలలు సేకరణ జరుగుతోంది.
- ప్రతివారం 250 మెట్రిక్ టన్నుల గెలల దిగుబడి
- సిద్దిపేట తరలింపునకు సిద్ధం
అయిజ, మే 10 : రైతులు పండించిన ఆయిల్ పాం గెలలను టీజీ ఆయిల్ సీడ్ కంపెనీ సేకరిస్తోంది. అయిజ మండలంతోపాటు వడ్డేపల్లి, రాజోళి, గట్టు, మల్దకల్ తదితర మండలాలకు చెందిన ఆయిల్ పాం తోటల పెంపకం దారుల నుంచి ఆయిల్ పామ్ గెలలు సేకరణ జరుగుతోంది. జిల్లాలోని 13మండలాల్లో ఆయిల్ పాం తోటల రైతుల నుంచి గెలలు సేకరించి సిద్దిపేటలోని ఆయిల్ కంపెనీకి తరలిస్తున్నారు. ప్రతి వారం దాదాపు 250మెట్రిక్ టన్నుల ఆయిల్ పాం గెలల సేకరణ జరుగుతోంది.
అయిజ పట్టణం, బీచుపల్లి మిల్లుతోపాటు గోనుపాడులోని ఆయిల్ పాం గెలలను సేకరిస్తున్నారు. సేకరించిన గెలలను గతంలో ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటకు ఆయిల్ ఫెడ్ అధికారులు తరలించేవారు. ప్రస్తుతం సిద్దిపేటలో కొత్తగా ఆయిల్ పాం ఫ్యాక్టరీ ఏర్పాటు కావడంతో అక్కడికి తరలిస్తున్నట్లు ఆయిల్ ఫెడ్ డీఎం శివనాగిరెడ్డి తెలిపారు. జిల్లాలో ఆయిల్ పాం తోటల పెంపకంపై రైతులు ఆసక్తిగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఆయిల్ పాం తోటల సాగుకు ముందుకొచ్చే రైతులను చైతన్యం చేస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఆయిల్ పాం తోటల సాగు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

