పంట పండింది..
ఆయిల్ పాం సాగు జోగుళాంబ గద్వాల జిల్లాలో సిరులు పండిస్తోంది. ఏపీకి పరిమితమైన ఆయిల్ పాం సాగును కేసీఆర్ హయాంలో తెలంగాణలో ప్రారంభించగా, నేడు పంట చేతికొచ్చి సిరులు కురిపిస్తోంది. నడిగడ్డలో ఆ యిల్పాం దిగుబడులు అధికంగా పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల భవిష్యత్‌పై దూరదృష్టితో ఆలోచించిన తెలంగాణ తొలి సీఎం కేసీఆ ర్ తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పాం సా గును ప్రోత్సహించారు.
- నడిగడ్డలో పెద్ద మొత్తంలో ఆయిల్‌పాం దిగుబడులు
- రైతుల కలలను పండించిన కేసీఆర్
- జోగుళాంబ గద్వాల జిల్లాలో 7 వేల ఎకరాల్లో తోటల సాగు
- 2 వేల ఎకరాల్లో చేతికొచ్చిన పంట
- నెలకు 2 వేల టన్నుల దిగుబడి
- సంతోషంలో అన్నదాతలు
అయిజ, జూలై 2 : ఆయిల్ పాం సాగు జోగుళాంబ గద్వాల జిల్లాలో సిరులు పండిస్తోంది. ఏపీకి పరిమితమైన ఆయిల్ పాం సాగును కేసీఆర్ హయాంలో తెలంగాణలో ప్రారంభించగా, నేడు పంట చేతికొచ్చి సిరులు కురిపిస్తోంది. నడిగడ్డలో ఆ యిల్పాం దిగుబడులు అధికంగా పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల భవిష్యత్‌పై దూరదృష్టితో ఆలోచించిన తెలంగాణ తొలి సీఎం కేసీఆ ర్ తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పాం సా గును ప్రోత్సహించారు.
ఒకప్పుడు ఆయిల్‌పాం సాగు అంటే కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమని భావించారు. అక్కడి వాతావరణ పరిస్థితులకే ఈ పంట అనుకూలమని చె ప్పేవారు. తెలంగాణ తొలి సీఎం ఉమ్మడి పాలమూరు జిల్లా ఆయిల్‌పాం సాగుకు అనువైనదిగా భావించి తోటల పెంపకంపై రైతులను చైతన్యం చేశారు. ఆయిల్ పాం సాగుకు అవసరమైన రాయితీలను ప్రకటి ంచి ప్రోత్సహించారు. గద్వాల జిల్లాను ప్రయోగాత్మకంగా తీసుకొని ఆయిల్ పాం తోటల పెంపకాన్ని ప్రారంభించారు.
గెలల సేకరణ ముమ్మరం..
అయిజ పట్టణంలోని పులికల్ రోడ్డులో ఉద్యానవన శాఖ, ఆయిల్ ఫెడ్ రైతుల నుంచి ఆయిల్ పాం గెలలు ముమ్మరంగా సేకరిస్తున్నారు. రైతులు పండించిన ఆయి ల్పాం గెలలను టీజీ ఆయిల్ సీడ్ కంపెనీ సేకరిస్తోంది. అయిజ మండలంతోపాటు వడ్డేపల్లి, రాజోళి, గట్టు, మల్దకల్ తదితర మండలాలకు చెందిన ఆయిల్‌పాం తో టల పెంపకందారుల నుంచి ఆయిల్ పాం గెలలు సేకరణ జరుగుతోంది. జిల్లాలోని 13మండలాల్లో ఆయిల్ పాం తోటల రైతుల నుంచి గెలలు సేకరించి సిద్ధిపేటలోని ఆయిల్ కంపెనీకి తరలిస్తున్నారు.
ప్రతి వారం దాదాపు 250మెట్రిక్ టన్నుల ఆయిల్ పాం గెలల సేకరణ జరుగుతోంది. అయిజ పట్టణం, బీచుపల్లి మిల్లుతోపాటు గోనుపాడులోని ఆయిల్ పాం గెలలను సేకరిస్తున్నారు. గతంలో సేకరించిన గెలలను ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటకు ఆయిల్ ఫెడ్ అధికారులు తరలించేవారు. ప్రస్తుతం సిద్ధిపేటలో కొత్తగా ఆయిల్ పాం ఫ్యాక్టరీ ఏర్పాటు కావడంతో అక్కడికి తరలిస్తున్నట్లు జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి రాజ్‌కుమార్ తెలిపారు. ఆయిల్ పాం తోటల సాగుకు ముందుకొచ్చే రైతులను చైతన్యం చేస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఆయిల్ పాం తోటల సాగు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

జిల్లాలో 7 వేల ఎకరాల్లో ..
జిల్లాలో 7వేల ఎకరాల్లో ఆయిల్ పాం తోటలు సాగు చేస్తుండగా, 2 వేల ఎకరాల్లో పంట చేతికొచ్చింది. నెలకు 2వేల టన్నుల దిగుబడి వస్తోంది. టన్ను ఆయిల్‌పాం గెలలను రూ.2,400 ఆయిల్ ఫెడ్ కొనుగోలు చేస్తోంది. నాడు ప్రారంభించిన ఆయిల్ పాం సాగు నేడు అద్భుత ఫలితాలను ఇస్తోంది. వలసలతో గుర్తింపు పొందిన నడిగడ్డ నేడు పచ్చని ఆయిల్‌పాం తోటలతో కళకళలాడుతోంది. గత బీఆర్ఎస్ సర్కారుపై నమ్మ కంతో ఆయిల్ పాం సాగు ప్రారంభించిన రైతులకు పంట చేతికొస్తుండటంతో మంచి ఆదాయం లభిస్తోంది. ఒక్కో సీజన్లో వేల టన్నుల దిగుబడులు వస్తుండగా, వందలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతోంది. వివిధ రకాల పంటలు సాగు చేసి తీవ్రంగా నష్టపోయిన రైతుల కలలు పండించిన ఘనత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రైతులు చెబుతున్నారు.
పంట చేతికొస్తోంది..
కేసీఆర్ హయాంలో 5.20ఎకరాల్లో ఆయిల్ పాం తోట సాగు చేశాను. ఏ పంటకు ఇయ్యనంత సబ్సిడీ బీఆర్ఎస్ సర్కారు ఇవ్వడంతో ఆయిల్ పాం పంట వేశాను. ఇప్పటికే మూడేళ్లు కావస్తోంది. ప్రతి ఏటా ఎకరాకు రూ. 49వేల వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. ఆయిల్ పాం తోటలో అంతర పంటగా కూరగాయలు సాగు చేస్తున్నాం. అంతర పంట ద్వారా లాభాలు గడిస్తున్నాం. వచ్చే యాసంగి నాటికి గెలలు కోతకొస్తాయి. ఇప్పటికే ఆదునుకు వచ్చిన తోటల రైతులు దిగుబడులు సాధిస్తూ ఆర్థికంగా బల పడుతున్నారు. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా సాగు చేస్తున్న ఆయిల్ పాం పంట లాభదాయకంగా ఉంది.
– కిష్టన్న, రైతు, ఉత్తనూర్, అయిజ మండలం, జోగుళాంబ గద్వాల జిల్లా
ఆయిల్‌పాం లాభాలు
ఆయిల్ పాం సాగులో మంచి లాభాలు వస్తున్నాయి. టన్ను ఆయిల్ పాం గెలలు రూ. 2,400 ధర పలుకుతోంది. ఏ పంటకు లేని ధర ఆయిల్ పాంకు ఉండటంతో రైతుగా సంతోషపడుతున్నాం. గతంలో ఎన్నో రకాల పంటలు సాగు చేసినా దిగుబడులు రాక, ధరలు లేక తీవ్రంగా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. ఏడేండ్ల కిందట సాగు చేసిన పంట ప్రస్తుతం అధిక దిగుబడులు వస్తుండటంతో లాభాలు వస్తున్నాయి. నాలుగేళ్ల వరకు సర్కారు రాయితీ ఇస్తుండటంతో రైతుకు నష్టం అనేది కనించడంలేదు. నాలుగేళ్లు పంటను రక్షించుకుంటే ఆ తర్వాత పంట రైతును బలోపేతం చేస్తుంది.
– కొత్తకోట జయన్న, రైతు, కేశవరం, అయిజ మండలం, జోగుళాంబ గద్వాల జిల్లా
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

