మరికల్, నవంబర్ 16: మండలంలోని కన్మనూర్‌లో ఉపాధి హామీ పనుల్లో చోటుచేసున్నదనే ఆరోపణతో అధికారులు శనివారం విచారణ చేపట్టారు. అ యితే విచారణకు ఫిర్యాదురులను అధికారులు నిరాకరించడంతో కొంతసేపు వాగ్వాదం చోటుచేసున్నది. అనంతరం అధికారులు ఫిర్యాదుదారులకు నచ్చజెప్పడంతో గ్రామస్తులు శాంతించారు. వివరాలిలా.. మరికల్ మండలంలోని కన్మనూర్‌లో ఉపాధి హామీ పనుల్లో రూ. 2.75కోట్లు అవినీతి చోటుచేసున్నదని గ్రామస్తులు ఇటీవల పాలమూరు ఎంపీ డీకే అరుణకు తెలిపారు.
స్పందించిన ఎంపీ వెంటనే నారాయణపేట కలెక్టర్ సి క్తాపట్నాయక్కు విచారణ చేపట్టాలని ఆ దేశించారు. కలెక్టర్ ఆదేశాలతో శనివారం కన్మనూర్‌లో విచారణ అధికారిగా మక్తల్ ఎంపీడీవో రమేశ్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. జీపీ కార్యాలయంలో చేపట్టిన విచారణకు ఫిర్యాదుదారులు మేము కూడా వస్తామని చెప్పడంతో అధికారు లు నిరాకరించారు. దీంతో ఫిర్యాదు దా రులు రావొద్దనే విషయం లిఖితపూర్వకంగా రాసివ్వాలని ఫిర్యాదుదారులు పట్టుబట్టారు. ఫిర్యాదుదారులు, ఫీల్డ్ అసిస్టెంట్ వస్తే విచారణ పూర్తిస్థాయిలో జరిపించలేమని, ఘర్షణ వాతావరణం నె లకొంటుందని విచారణ అధికారి సూచించడంతో గ్రామస్తులు శాంతించారు.
అ నంతరం గ్రామంలో 30మంది కూలీల ను విచారించారు. విచారణలో కొంతమంది రైతులు పనులకు వెళ్లకున్నా పను లు చేసినట్లు తెలిపారు. మరికొంత మం ది పనులు చేసినట్లు తెలిపారు. కూలీల జాబ్‌కార్డులు ఫీల్డ్ అసిస్టెంట్ వద్దే ఉన్నాయని కూలీలు తెలిపారు. అలాగే ధన్వాడ ఈసీ ప్రసన్నకుమార్, నారాయణపేట ఏ పీవో మొగులప్ప, మక్తల్ ఏపీవో శ్రీనివాసులు బృందం గ్రామంలో ఉపాధి హామీ పనులు ఎక్కడెక్కడ చేశారో తెలుసుకొని పరిశీలించారు. ఈ సందర్భంగా విచారణ అధికారి మాట్లాడుతూ.. కూలీలతో విచారణ చేశామని, ఫీల్డ్‌లో కూడా విచారణ చేశామని, అవీనితి జరిగిందా.. లేదనేదా నిపై కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామ న్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కొం డన్న, పంచాయతీ కార్యదర్శి ఉన్నారు.