అమరచింత, జూలై 17 : నాలుగు రోజుల కింద ట మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న మక్తల్ నియోజకవర్గం అమర చింత మండలంలోని పాంరెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు అధికార పార్టీ అధ్యక్షుడితోపాటు మరో ముగ్గు రు నాయకులు ఇంటిబిల్లుల చెల్లిం పు కోసం ఏకంగా రూ.యాభై వేలు లం చం అడిగారని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ అధికారి కాల్మేష్తో పాటు హౌసింగ్ జిల్లా అధికారి విటోభాతో కలిసి ఏవరిపైన అయితే ఆరోపణలు వచ్చాయో వారినే వెంట బెట్టుకుని లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి విచారణ చేపట్టి వారు లంచం ఆడగలేదని అధికార పార్టీ నేతలపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పడంపై అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు.
ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసుకున్న లబ్ధిదారుల ఇంటికి పరిశీలనకు వచ్చిన అధికారిపై తమకు సమాచారం ఇవ్వకుం డా ఎలా వస్తారని అధికార పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసిన మాటలను నిజమేనని చెబుతున్న విజలెన్స్ అధికారులకు లంచం అడిగారని వచ్చిన ఆరోపణలపై ఎలా విచారణ చేయాలో తెలియదా, లేకపోతే విచారణ అధికార పార్టీ నాయకుల సమక్షంలోనే చేయాలని ఆదేశాలు ఉ న్నాయా అంటు ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంపై సీపీఎం మండ ల కార్యదర్శివర్గ సభ్యులు అజయ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల బిల్లులకు అధికార పార్టీ నాయకులు లంచం అడగడంపై అధికారులు విచారణ చేయాలని కోరారు.