కోడేరు, మే 25 : చెరువులు, కుంటల్లో పూడిక మట్టిని పొలాల్లో వేసుకుంటే పంటకు పోషణ లభించి అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ మట్టితో పొలాలు సారవంతంగా మారుతాయని, సాగుకు రసాయన ఎరువుల వాడకం తగ్గి పెట్టుబడి ఖర్చులు మిగులుతాయని అధికారులు వివరిస్తున్నారు.
కానీ చాలా వరకు ఈమట్టితో ఇటుక బట్టీలు పెడుతూ కొందరు వ్యాపారులు రూ.లక్షలు గడిస్తున్నారు. పంట భూములను సైతం ఇటుక బట్టీలుగా మార్చి వ్యాపారం చేస్తున్నారు. ఈమట్టినే వ్యవసాయ సాగు భూమలుల్లో వేసుకుంటే మరింత సారవంతగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు పశుసంపద తగ్గిపోవడంతో సేంద్రియ ఎరువులు లేక పంటల సాగుకు 90శాతానికి పైగా రైతులు రసాయన ఎరువులు, పురుగు మందులు, గడ్డిమందులు, విచ్చలవిడిగా వాడుతున్నారు.
దీంతో పర్యావరణానికి జీవకోటికి హాని కలుగుతున్నది. ఫలితంగా పంట భూములు నిస్సారంగా మారుతున్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్షాలకు సారవంతమైన పోషకాలు కొట్టుకొచ్చి చెరువులు, కుంటల్లో నిక్షిప్తమవుతాయి. చెరువుల్లో పేరుకుపోయిన మట్టిని తిరిగి పొలాల్లో వేయటం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని పూడిక మట్టిని చేలల్లో వేసుకోవడానికి ఇదే అనువైన సమయమని అధికారులు పేర్కొంటున్నారు.
పూడికమట్టితో ప్రయోజనం
నేల గుణాన్ని బట్టి ఎకరాకు 15 నుంచి 40 ట్రాక్టర్ల పూడిక మట్టిని వే సుకోవచ్చు. పూడికమట్టిలో తేమను పట్టి ఉంటే గుణం ఎక్కువగా ఉం టుంది. పంటకు పోషకాలు అందుతాయి. ఇసుక, గ రుసు తదితర తక్కువ సారమున్న నేలలకు పూడికమట్టితో ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రధానంగా సేంద్రియ కర్బనం ఉండే ఎర్రనేలలు తేలికపాటి నేలలకు ఉపయుక్తంగా ఉం టుంది. -మధుసూదన్‌రెడ్డి,ఏఈవో, కోడేరు.