కల్వకుర్తి, జూలై 31 : స్టేట్ ఫైనాన్స్ నిధులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీలకు కరెంట్ షాక్ తగిలింది. 2026 జనవరి నుంచి జూలై వరకు గ్రామ పంచాయతీలకు స ంబంధించిన కరెంట్ బిల్లులు చెల్లించాలని పంచాయతీ ఉన్నతాధికారులు హుకుం జారీ చేయడంతో గ్రామ కార్యదర్శులు తల్లడిల్లుతున్నారు.
గ్రామ పంచాయతీల అభివృద్ధికి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా కరెంట్ బిల్లులు కట్టమంటే ఎక్కడ నుంచి తెచ్చి కట్టాలని గ్రామ సర్పంచులు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో మౌలిక వసతులకే డబ్బులు లేక తల్లడిల్లుతున్న తరుణంలో కరెంట్ బిల్లులు చెల్లించాలని గొం తుపై కత్తి పెట్టడం అన్యాయమని సర్పంచులు మండిపడుతున్నారు. కేంద్రం నుంచి మంజూరైన 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి పంచాయతీలను నెట్టుకొస్తున్నామని.. రాష్ట ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి నిధులు విడుదల చేసి కరెంట్ బిల్లులు అడగాలని సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు.
జనవరి 2026 నుంచి జూలై వరకు గ్రామ పంచాయతీలకు చెందిన వీధి దీపాలు, తాగునీటి బోర్లకు సంబంధించిన కరెంట్ బిల్లులుచెల్లించాలని పంచాయతీ శాఖ ఉన్నతాధికారులు గ్రామాల సర్పంచులకు నోటీసులు జారీ చేశారు. జూలై 31 నాటికి 6 నెలలకు సంబంధించిన మొత్తం బిల్లులు చెల్లించాలని ఆర్డర్ వేశారు. గ్రామ పంచాయతీల్లో రోజువారి ఖర్చులకు కూడా డబ్బులు జమకాని పరిస్థితుల్లో కరెంట్ బిల్లులు చెల్లించేదెలా? అంటూ సర్పంచులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1,692 గ్రామ పంచాయతీలు ఉన్నా యి. ఈ జీపీలకు సంబంధించిన కరెంట్ బిల్లు ఆరు నెలలకు రూ. 32,06,57,151 (ము ప్పై రెండు కోట్ల ఆరు లక్షల యా భై ఏడు వేల నూట యాభై ఒక్క రూపాయి)లను ఎస్పీడీసీఎస్కు చెల్లించాలని అధికారులు గ్రామ సర్పంచ్, కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు.
నాగర్కర్నూల్ జిల్లాలో 461 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో వీధి లైట్ల బకాయి రూ.4,24,46,537, తాగునీటి బోర్ల బకాయిలు రూ.5,13,13,330, మొత్తం రూ. 9,37,59,867బకాయి ఉన్నది. మహబూబ్నగర్ జిల్లాలో 441 గ్రామ పంచాయతీల్లో వీధి లైట్ల బకాయిలు రూ.3,02,26,259, తాగునీటి బోర్ల బకాయిలు రూ.4,11,96,557, మొత్తం రూ.7,14, 22,816 బకాయిలు ఉ న్నాయి. నారాయణపేట జిల్లాలో 280 గ్రామ పంచాయతీల్లో వీధి లైట్ల బకాయిలు రూ.1,86,74,842, తాగునీటి బోర్ల బకాయిలు రూ. 2,78,34,885. మొత్తం రూ.4,65, 09,727 బకాయి ఉన్నది. వనపర్తి జిల్లాలో 255 గ్రామపంచాయతీల్లో వీధి దీపాల బకాయిలు రూ. 2,12,61,382, తాగునీటి బోర్ల బకాయిలు రూ. 5,46,58,282, మొత్తం రూ.7,59,19,664 బకాయిలు ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలలో వీధి దీపాలకు రూ.1,38,04,201, తాగునీటి బోర్ల బకాయిలు రూ.1,92,40,876. ఇలా మొత్తం బకాయి లు రూ.3,30,45,077 వరకు బకాయిలు ఉన్నాయి.
గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక( జీపీడీపీ) రూపొందించే సమయంలో గ్రామ సభలో విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసి చేతులు దులుపుకొన్నది. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనకు 15వ ఆర్థిక సంఘం నిధులు వాడుకుంటున్న నేపథ్యంలో కరెంట్ బిల్లులకు డబ్బులు చెల్లించేందుకు ఎస్ఎఫ్సీ నిధులు వాడుకునే వెసులుబాటు ఉం టుంది. ఎస్ఎఫ్సీ నిధులు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేయకుండా కరెంట్ బిల్లులు చెల్లించాలని ఒత్తిడి తేవడంతో అర్థమేముందని గ్రామ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని చిన్న గ్రామ పంచాయతీల్లో పనిచేసే ఒకరిద్దరు సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుందని, అటువంటి గ్రామ పంచాయతీల్లో రూ.లక్షల కరెంట్ బిల్లు ఎలా చెల్లిస్తారని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. ఎస్ఎఫ్సీ నిధులు ఇచ్చి కరెంట్ బిల్లులు కట్టమంటే కడుతామని, లేనిపక్షంలో కరెంట్ బి ల్లులు కట్టలేమని సర్పంచులు తేల్చి చెబుతున్నారు. గత వారం ప్ర జావాణిలో నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన సర్పంచులు కరెంట్ బిల్లుల ను కట్టలేని పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలు ఉన్నాయని, కరెంట్ బిల్లులు చెల్లించమని ఒత్తిడి తెవద్దని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామానికి సమృద్ధిగా మిషన్ భగీరథ తా గునీరు సరఫరా అయింది. కరెంట్ బిల్లు లో తాగునీటి బోర్ల బిల్లే (ఆరు నెలలకు)దాదాపు రూ.20 కోట్లు ఉన్నది. మిషన్ భ గీరథ తాగునీరు ఉచితంగా సరఫరా చేస్తు న్న క్రమంలో బోర్ల బిల్లు ఇంత ఎక్కువ వ స్తుందన్నదే శేష ప్రశ్న. మిషన్ భగీరథ తాగునీరు సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్న క్రమంలో పూర్తి స్థాయిలో గ్రామాలకు మిషన్ భగీరథ తాగునీరు సరఫరా కావడం లేదని పలు గ్రామాల సర్పంచులు అంటున్నారు. అందుకే బోరు బావుల ద్వారా తాగునీరు సరఫరా చేయాల్సి వస్తుందని వారు చెబుతున్నారు.
కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు నేపథ్యంలో కరెంట్ బిల్లులు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడం చాలా బాధగా ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ బిల్లుల కోసం ప్రత్యేక నిధులు ఇవ్వాలి గ్రామాల్లో వీధి దీపాలు, తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా కరెంట్ బిల్లుల కోసం ప్రత్యేక నిధులు ఇవ్వాలని గ్రామ సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే వినియోగంలో లేని బోర్ల విద్యుత్ కనెక్షన్లు రద్దు చేయాలని, నెల వారీగా విద్యుత్ బిల్లులు చెల్లించే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తే గ్రామ పంచాయ తీలకు మేలు జరుగుతుందని గ్రామ సర్పంచులు అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా కరెంట్ బిల్లులు చెల్లించమంటే ఎక్కడ నుంచి తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులు గ్రామ అవసరాలకు సరిపోతున్నాయి. పంచాయతీల మరమ్మతులు, కంప చెట్లు తొలగించడం, కొ త్తగా మురుగు కాల్వలు, సీసీ రోడ్డు వేయి ంచాం. గతంలో సర్పంచులు చేసిన పనులకు సంబంధించిన బిల్లులు కూడా చెల్లించాల్సి వచ్చిం ది. ఇంకా డబ్బులు ఎక్కడ ఉంటాయి. ఎస్ఎఫ్సీ నుంచి జీపీలకు గ్రాంట్స్ ఇచ్చి కరెంట్ బిల్లులు కట్టమంటే అర్థముంటుంది. ఇవ్వకుండా కట్టమంటే ఎక్కడ నుంచి తెచ్చి కట్టేది..?.
– రాంభీష్మ, సర్పంచ్, డిండిచింతపల్లి, వంగూర్ మండలం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్లే జీపీలకు ప్రధాన ఆదాయ వనరు. ఇక్కడ ప్రత్యేకంగా వచ్చే ఆదాయం ఏమీ ఉండదు. పన్నుల రూపంలో వచ్చినా ఒకరిద్దరి సిబ్బంది జీతాలకు కూడా సరిపోదు. కేంద్రం ఇచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాం. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎఫ్సీ నిధులు ఇస్తే కరెంట్ బిల్లులు కట్టే వెసులుబాటు వస్తుంది. కానీ నిధులు ఇవ్వడం లేదు. అభివృద్ధికి బడ్జెట్లో రూ.వేల కోట్లు కేటాయిస్తున్నా.. జీపీలకు మాత్రం విడుదల చేయడం లేదు. ఎస్ఎఫ్సీ నిధులు విడుదల చేయాలి. కరెంట్ బిల్లులు కట్టాలని సర్పంచుల గొంతుపై కత్తులు పెడితే ఏం ప్రయోజనం.
– యాదగిరిరెడ్డి, సర్పంచ్, ఎంగంపల్లి