వనపర్తి, డిసెంబర్ 8 : వనపర్తి నియోజకవర్గ ప్రజల సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రితో పలువురు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని వాటిని అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వెనువెంటనే అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రజల సమస్యలను ఆలస్యం లేకుండా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే జిల్లాలో ఎటువంటి సమస్యలు వచ్చినా జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు అందుబాటులో ఉంటారని వారి దృష్టికి తీసుకొని రావాలని ప్రజలకు సూచించారు.
అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై కార్యకర్తలు, ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, ఎంపీపీ కృష్ణానాయక్, మీడియా కన్వీనర్ అశోక్, కౌన్సిలర్స్ బండారు కృష్ణ, కంచె రవి, పాకనాటి కృష్ణ, నాగన్నయాదవ్, సమద్, నాయకులు ప్రేమ్‌నాథ్‌రెడ్డి, చెన్నరాములు, గంధం పరంజ్యోతి, కృష్ణ, రహీం, అస్లామ్, వేణుగోపాల్, గులాంఖాదర్, జోహెబో, ఆరిఫ్, రమేశ్, గౌస్, విజయ్, డ్యానియల్, రాము, బాలరాజు, కార్తీక్, శ్రీనుతోపాటు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.