అచ్చంపేటటౌన్, డిసెంబర్ 11 : కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని, కేవలంలో కక్ష పూరిత ధోరణితో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ గువ్వల బాలరాజు అన్నారు. బుధవారం సాయంత్రం అ చ్చంపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చివేతలు, బూతులు మాట్లాడడం తప్పా ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎవరైనా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమ లు చేయాలని ప్రశ్నిస్తే వారిపై దాడులు చేయించి కే సులు నమోదు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్పా కాంగ్రెస్ ఎమ్మెల్యే కొత్తగా చేసిందేమీ లేదని విమర్శించారు.
అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేష న్ ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు ఎప్పటి వరకు అందిస్తారని సూటిగా ప్రశ్నించారు. లిఫ్ట్ ఇరిగేషన్ కాల్వలు ముందు చెప్పిన మార్గం కాకుండా ప్రధానంగా బీఆర్ఎస్కు చెందిన రైతుల పొలాల మధ్యన పోయే విధంగా రూట్ మ్యాప్ ఇవ్వడం సరికాదన్నా రు. అచ్చంపేట నియోజకవర్గం మన్ననూర్ ప్రధాన రహదారి వెంబడి, దోమలపెంటలో గత కొన్నేండ్ల నుంచి చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న వారి వ్యాపారాలను తీసి వేయించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ము ఖ్యంగా రాష్ట్రంలో తెలంగాణ తల్లిని మార్చాల్సిన అ వసరమేముందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్ర తిష్టాపన చేసింది తెలంగాణ తల్లి విగ్రహం కాదని కాంగ్రెస్ తల్లి విగ్రహమని మండిపడ్డారు.
అదేవిధం గా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు 420 హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. మహిళకు ప్రతి ఒక్కరికీ రూ.2500, ఇంటిలో ఇద్దరికి రూ.4వేల పింఛన్, కల్యాణలక్ష్మికి ప్రభుత్వం ఇ చ్చే రూ.లక్షతోపాటు తులం బంగారు అందజేస్తామ న్నా హామీలు కూడా అమలు కావడం లేదన్నారు. రైతులు, ఉద్యోగులు, మహిళలు ఇలా ప్రతి వర్గాన్ని మోసం చేస్తుండడంతో అందరూ ఆగ్రహంతో ఉన్నారని త్వరలో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చె ప్పడం ఖాయమన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు మన్ను పటేల్, రమేశ్రావు, శివ, పార్టీ నాయకులు అమీనొద్దీన్, మాజీ జెడ్పీటీసీ రాంబాబునాయక్, శంకర్ మాదిగ, దేవ, రేణయ్య, కరుణాకర్, సోషల్ మీడియా ఇన్చార్జి పల్లి బాలరాజు పాల్గొన్నారు.