రాజోళి, జూన్ 26 : తుమ్మిళ్ల రీచ్ వద్ద సైట్ ఇన్చార్జిపై జరిగిన దాడిపై ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని, ఈ విషయంపై పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. తు మ్మిళ్ల శివారులో ప్రభుత్వం అనుమతులతో టీజీఎండీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇసుక రీచ్ వద్ద సైట్ ఇన్చార్జి లక్ష్మీనారాయణ చౌదరిపై ఈనెల 22వ తేదీన ఏపీకి చెందిన నాయకుడు మిడిమిల్లి శ్రీధర్ కొంత మంది రౌడీలతో కలి సి దాడి చేసి సైట్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరింపులకు పాల్పడిన ఉధంతం పై పెద్ద తలకాయలు ఉన్నట్లు ప్రజ లు ఆరోపిస్తున్నారు.
ఈ విషయంపై స్థానిక ఎస్సై గోకారిని వివరణ కోరగా బాధితు డు లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుపుతున్నామని, సీసీ పుటేజ్లను పరిశీలిస్త్తూ వివరాలను సేకరిస్తున్నట్లు అన్ని వివరాలు సేకరించిన అనం తరం కేసు నమోదు చేస్తామన్నారు.