అలంపూర్, ఆగస్టు 13 : నడిగడ్డలో రెండు వైపు లా రెండు నదులు ప్రవహిస్తున్నప్పటికీ సాగునీటికి తిప్పలు తప్పడం లేదు.. తెలంగాణ ప్రభుత్వం తెలివి తక్కువ తనం వల్ల ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని ఎత్తిపోయలేక పోతుంది.. ఆంధ్రా ప్రాంతం వారు తెలివిగా లెక్కకు మించిన వాటాలతో ప్రాజెక్టుల్లోని నీటిని ఎత్తిపోసుకుంటుంటే తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. ఆంధ్రా ప్రాంత రైతులపై ఉన్న ప్రేమ తెలంగాణ రైతులపై ఎందుకు లేదని సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన ప్రశ్నించారు. గురువారం మాజీ మంత్రి రైతులతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా లో ఏర్పాటు చేసిన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సందర్శనకు వెళ్తుండగా ఆంధ్రా పోలీసులు జూపాడు బంగ్లా వద్ద ఆయనను అడ్డుకున్నారు. దీంతో ఆయన నడిరోడ్డుపైనే కూర్చొని నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల కోసం కట్టిన ప్రాజెక్టులను చూడడానికి వెళ్తుంటే అడ్డుకోవడం దారుణమన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం నీటిని ఎలా వినియోగించుకుంటుంది, మ నం ఎందుకు వాడుకోలేకపోతున్నామని అని రైతులకు చూపెట్టడానికి మా త్రమే వెళుతున్నాం, అడ్డుకోవడానికి ఏ మాత్రం కాదని చెప్పిన ముందుకు వెళ్లకుండా మమ్మల్ని అడ్డుకోవడం ఏమిటని పోలీసులను నిలదీశారు. అడ్డుకోవడం మనేది అప్రజాస్వామికమని, అన్యామని వాదించారు. నీటి వాడకం విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకు వస్తే.. మీరు ఎందుకు అడ్డుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదని విచా రం వ్యక్తం చేశారు. గడచిన ఎన్నికల్లో అబద్ధాలతో, అమలుకు సాధ్యం కానీ హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతన్నలపై కపట ప్రేమ చూపెడుతుందని ఆరోపించారు. ఎగువన జూరాల, దిగువన శ్రీశైలం ప్రాజెక్టుల్లో అవసరమైనంత నీటి నిల్వలు ఉన్నా ఆ నీటి ని ఎత్తిపోయలేని దౌర్భాగ్య స్థితిలో నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.
ఎల్‌నినో అని, కరువు అని కుంటి సాకులు చెప్పి రైతాంగాన్ని మభ్యపెడుతుందని ధ్వజమెత్తారు. ఎగువ ప్రాం తం ఆల్మట్టి, నారాయణ్‌పూర్ నుంచి రెండు కలిపి 150 టీఎంసీలు నీరు ఉండగా రోజుకు 2లక్షలు, 2 లక్షల యాభై వేల క్యూసెక్కుల నీరు దిగువకు వచ్చి చేరుతున్నా వాటి ని ఎత్తిపోతల పథకాలకు వినియోగించకుండా వచ్చిన నీరు వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారని ఆరోపించారు. రెండు రోజుల కిందట వనపర్తి జిల్లాలో నిర్వహించిన ఇరిగేషన్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని మన దగ్గర ఉన్న నీటిని ఎలా వాడుకోవాలి అనే విషయాలను చర్చించకుండా రైతులను ఆరుతడి పంటలు మాత్రమే వేసుకునేలా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకవైపు కృష్ణా నది నిండుగా ప్రవహిస్తున్నా ఆ నీటిని ఒడిసిపట్టుకోలేని ప్రభుత్వం రైతులను మాత్రం ఎల్‌నినో ప్రభావం ఉందని, ప్రాజెక్టు నీటిని తాగునీటికి మాత్రమే వాడుకోవాలని మభ్య పెట్టే మాటలు చెబుతూ ఆంధ్రాకు నీటిని దారదత్తం చేస్తున్నదని దుయ్యబట్టారు. ప్రజలకు మంచి నీళ్లకు ఎటువంటి ఇబ్బంది లేదు.
గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన పథకం అద్భుతంగా ఉంది. మిషన్ భగీరథ పథకం ద్వారా ఊరూరికి కుళాయిలతో శుద్ధమైన నీరు అందించామన్నారు. ప్రస్తుతం ఈ రోజు వరకు శ్రీశైలం ప్రాజెక్టులో 180 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మంచి నీటి అవసరాలకు జూరాల మీద గాని, శ్రీశైలం ప్రాజెక్టు మీద ఆధారపడిన 21 శాసనసభ నియోజకవర్గాలకు యేడాది మొత్తంలో కేవలం 9 టీఎంసీలే అవసరం అవుందన్నారు. ఈ రోజు వరకు శ్రీశైలం ప్రాజెక్టులో 180 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.
కర్ణాటక రాష్ట్రంలో 17లక్షల ముప్పై వేల ఎకరాల ఆయకట్టుకు నీరు వాడుకోగా, మిగిలిన నీరు కిందికి పారే నీళ్లే సుమారుగా రోజుకు 6 నుంచి 7వేల కూసెక్యూల నీరు వస్తాయన్నారు. వరదలు రాకపోయిన, వర్షాలు కురవక పోయిన ఈ వానకాలం పంటలకు సాగునీటికి ఇబ్బందే లేదు. శ్రీశైలం ప్రాజెక్టు మీద ఆధారపడి నటువంటి కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి అంతకంటే ఇబ్బం ది లేదని స్పష్టం చేశారు. శ్రీశైలం కనిష్ఠం వంద టీఎంసీల నీరు ఉన్న రోజుల్లో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో 40 టీఎంసీ నీరు సాగు నీటి అవసరాలకు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇయాల ప్రభు త్వం మొదటి వానకాలం పంటకే మోక్షం లేదంటుంది. సాగునీటి సరఫరా విషయం లో, పంపులు ఆన్ చేసే విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ రైతులను ఘోరంగా వంచిస్తుందని ఆరోపించారు.
ఇలాంటి వాస్తవ పరిస్థతులను తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ప్రాజెక్టు సందర్శనకు రావడం జరిగిందన్నారు. పోతిరెడ్డి పాడు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపెట్టిన రోజుల వారి అధికారిక లెక్కల ప్రకారం 8 లేక 9 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. కానీ వాస్తవంగా 40 నుంచి 50వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి వాస్తవాలు బట్టబయ లు అవుతాయనే ఉద్దేశంతోనే మమ్మల్ని ప్రాజెక్టు వరకు పోనిస్తలేరని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి వచ్చి అధికారిక లెక్కలు రికార్డులు చేసుకున్నారు. పాలమూరు ప్రజలకు ఈ విషయాలు అర్థం కావాలనే ఈ రోజు రావడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఇచ్చిన సా గు నీరు తెలంగాణ రైతులకు ఎందుకు ఇవ్వలేక పో తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రైతులను ఏపీ పోలీసులు అడ్డుకున్న ఘటన చాలా బాధకరం అన్నారు.