ఖిల్లాఘణపురం, డిసెంబర్ 7 : గణపసముద్రం ముంపు రైతులకు ఎకరాకు రూ.25లక్షలు ఇప్పిస్తే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నా రు. ఆదివారం మండల కేంద్రంలో ఖిల్లాఘణపురం గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అజంత తరఫున నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఆయ న మాట్లాడారు. 12 ఏండ్ల కిందట గణపురం ఎట్టుం డే నేడు ఎట్లా ఉందో ప్రజలు భేరీజు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గణపసముద్రం ముంపు రైతులకు కాంగ్రెస్ నాయకులు ఎకరాకు రూ.25లక్షలు ఇప్పిస్తామని నమ్మబలికిన దొంగలు ఎక్కడ ఉన్నారన్నా రు.

నాటి తమ ప్రభుత్వంలో ఎకరాకు రూ.11లక్షల 75వేలు ఇప్పిస్తామని చెప్పిన మాటకు కట్టుబడి ఉ న్నామన్నారు. ఇప్పటికైనా రూ.25లక్షల నష్టపరిహా రం ఇప్పిస్తామని కాంగ్రెస్ నాయకులు ఇప్పిస్తే క్యామ అజంత ఎన్నికల బరినుంచి తప్పుకుంటుందని సవా ల్ విసిరారు. చేసిన అభివృద్ధి కొనసాగించలేని దుస్థితి కాంగ్రెస్ నాయకులు ఉన్నారన్నారు.
పేద ప్రజల కోసం 315 ప్లాట్లు లేఅవుట్ వేసి సిద్ధంగా ఉంచితే పంపిణీ చేయలేని వారికి పాలించే హక్కు ఎక్కడిదని అన్నారు. ఓట్లు అడిగే కాంగ్రెస్ నాయకులను ఆసరా పింఛన్లు రూ.4వేలు, మహిళలకు రూ.2500, కల్యాణలక్ష్మి ద్వారా తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు, ధాన్యానికి బోనస్, కేసీఆర్ కిట్టు, కంటి వెలుగు పథకాలు ఏవని నిలదీయాలని అన్నారు. రెండేళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అభివృద్ధ్ది కొనసాగించాలంటే క్యామ అజంత కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
