ఇంటర్మీడియట్లో కొత్త కోర్సు..
ఇంటర్ స్థాయిలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ల క్ష్యంతో అక్కౌంట్స్, కామర్స్, ఎకనామిక్స్, సబ్జెక్టులతో కలిపి ‘ఏసీఈ’ కొత్త కోర్సును ఇంటర్మీడియ ట్ బోర్డు ప్రవేశ పెట్టనుంది. జూన్లో ప్రారంభమయ్యే విద్యాసంవత్స రం నుంచే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, గురుకుల విద్యాలయాల్లో ఈ కోర్సు అందుబాటులోకి రా నుంది. ఇంటర్లో బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ కోర్సులున్నాయి.
- ఎంఈసీ స్థానంలో ఏసీఈ
మహబూబ్నగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 21: ఇంటర్ స్థాయిలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ల క్ష్యంతో అక్కౌంట్స్, కామర్స్, ఎకనామిక్స్, సబ్జెక్టులతో కలిపి ‘ఏసీఈ’ కొత్త కోర్సును ఇంటర్మీడియ ట్ బోర్డు ప్రవేశ పెట్టనుంది. జూన్లో ప్రారంభమయ్యే విద్యాసంవత్స రం నుంచే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, గురుకుల విద్యాలయాల్లో ఈ కోర్సు అందుబాటులోకి రా నుంది. ఇంటర్లో బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ కోర్సులున్నాయి. వీటికి భిన్నంగా గణితం, సైన్స్కు సంబంధం లేకుండా త్వరితగతిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కొత్త కోర్సులు తీసుకురావాని కొన్నేళ్లుగా ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యారంగ నిపుణులతో చర్చించి ఏసీఈ కోర్సు అమలు చేయాలని నిర్ణయించింది.
మంచి ఉపాధి అవకాశాలు
ఏసీఈ చదివే విద్యార్థులకు భవిష్యత్లో మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయని, డిగ్రీలో కామర్స్ గ్రూప్లో చేరొచ్చని అధికారులు తెలిపారు. డిగ్రీలో బీకాం, బీఏ అనంతరం ఎంబీఏ, ఎంసీఏ చదివేందుకు అవకాశం కల్పించారు. సీఏలో సైతం చేరే అవకాశం ఉంది. బ్యాంకింగ్, అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ మేనేజ్మెంట్, ఫైనాన్స్, మార్కెటింగ్ రంగాల్లో ఉపాధి అవకాశాలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చు. దీంతో ప్రస్తుతం ఉన్న ఎంఈసీ గ్రూప్ కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాలో జూనియర్ కళాశాలలు ఇలా..
మహబూబ్నగర్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 47 ఉన్నాయి. వనపర్తి జిల్లాలో 35, నాగర్కర్నూల్ జిల్లాలో 39, నారాయణపేట జిల్లాలో 21, జోగుళాంబ-గద్వాల జిల్లాలో 21 కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఆయా కళాశాలల్లో తరగతి గదులు, మౌలిక సదుపాయాలను అధికారులు క్రోడీకరించి కొత్త కోర్సు ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో..
ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు రానున్న విద్యా సంవత్సరం నుం చి ఏసీఈ కోర్సు అందుబాటులోకి రానుంది. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ కోర్సు చదివితే త్వరగా స్థిరపడొచ్చు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఈ కోర్సును ఇంప్లిమెంటేషన్ చేసేందుకు ఆయా కళాశాలలు, గురుకుల విద్యాలయాలు, కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, ప్రైవేటు కళాశాలల్లో అందుబాటులో ఉన్న వసతులు, వనరుల వివరాలు ఆరా తీస్తున్నాం. విద్యార్థుల సంక్షే మం దృష్ట్యా అన్ని విధాలుగా అనువైన కళాశాలల్లో ఈ కొత్త కోర్సును ప్రారంభించేలా చర్యలు చేపడ్తాం.
– చిలుక రమణి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారిణి, మహబూబ్నగర్
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటిని, కరెంటును పొదుపుగా వాడాలి’
కేతావత్ చంద్రు మృతి బాధాకరం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

