పాలమూరు, జూన్ 4 : నీట్ ఫలితాల్లో మహబూబ్‌నగర్‌లోని రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయస్థాయిలో విజయభేరి మోగించారు. కె.అనన్య 627 (720 మార్కులకు) మార్కులు సాధించి మొదటి స్థానాన్ని సాధించిందని కళాశాల కరస్పాండెంట్ ఎస్.చంద్రకళావెంకట్, సలహాదారు వెంకటయ్య, డీన్ భూపాల్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఇ.మౌనిక 621, ఎండీ సఫాన్సాద్ 610, ఏ.సంతోష్‌కుమార్ 600 మార్కులు సాధించి రికార్డు సృష్టించినట్లు యాజమాన్యం తెలిపింది. అదేవిధంగా 600 మార్కులకు పైగా నలుగురు, 550 మార్కులకు పైగా 21 మంది, 500 మార్కులకు పైగా 54 మంది, 450 మార్కులకు పైగా 126 మంది, రిజర్వేషన్ కేటగిరీల్లో కలిపి 165మంది విద్యార్థులు మెడికల్ సీట్లు పొందేందుకు అర్హత సాధించడం గర్వంగా ఉందని కళాశాల యాజమాన్యం పేర్కొన్నది. అదేవిధంగా జిల్లాలో అత్యధిక సీట్లు సాధించిన సంస్థగా రిషి చరిత్ర సృష్టించిందన్నారు.