మహబూబ్నగర్ కలెక్టరేట్, మే 3 : వైద్య కళాశాలల్లో (ఎంబీబీఎస్, బీడీఎస్) ప్ర వేశాలకు దేశవ్యాప్తంగా ఈనెల 4న నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష-2025 (నీట్)కు మహబూబ్నగర్ జిల్లాలో 13 కేంద్రాలు, గద్వాలలో 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో 4,454 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 1:30గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు.
పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని మహబూబ్నగర్ కలెక్టర్ విజయేందిరబోయి తెలిపా రు. అభ్యర్థులు అడ్మిట్ కార్డులో ఉన్న సూచనలు అన్నింటిని తు.చా. తప్పకుం డా పాటించాలి. ముఖ్యంగా అభరణా లు, భారీ దుస్తులు, బూట్లు, ధరించి పరీ క్షా కేంద్రంలోకి రాకూడదు. అభ్యర్థుల ఇటీవలి పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటోలు రెండు, పోస్టు కార్డు సైజ్ కలర్ ఫొటోతో రావాలి.
గద్వాల, మే 3 : జోగుళాంబ గ ద్వాల జి ల్లాలో 1,029 మంది పరీక్షకు హాజరు కా నున్నారని, ఈ మే రకు గద్వాల పట్టణంలో ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పా ఠశాలలతోపాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 3పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ సంతోష్ వెల్లడించారు. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం 9100901606 నెంబర్ను సంప్రదించాలని సూచించారు.