గట్టు : ప్రభుత్వ పాఠశాలల్లో ( Government Schools ) విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే అవసరమైన ఉపాధ్యాయులను( Teachers ) నియమించాలని జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు ( Bass Hanmanth Naidu) డిమాండ్ చేశారు.
బాలల హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన తల్లిదండ్రుల నిరసన ప్రదర్శన కార్యక్రమానికి ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. గట్టు మండలంలో మొత్తం 46 పాఠశాలలు , కేటి దొడ్డి మండలంలో 36 పాఠశాలలు ఉంటే అందులో ఉపాధ్యాయులు మాత్రం గట్టు మండలంలో 176 పోస్టులు శాంక్షన్ అయితే 142 మంది పని చేస్తున్నారని అన్నారు.
కెటీ దొడ్డి మండలంలో 16 ప్రభుత్వ పాఠశాలలకు 107 శాంక్షన్ అయితే 100 మంది ఉపాధ్యాయులు పోస్టులు మాత్రమే భర్తీ చేశారని ఆరోపించారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మొత్తం కలిపి ఒకరు, ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉంటున్నారని పేర్కొన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రం చర్యలు తీసుకొని ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నాగర్ దొడ్డి వెంకట రాములు, ఆతుకూరి రెహమాన్, నూర్ పాషా, డి.శేఖర్నాయుడు, గంజిపేట రాజు, కురవ పల్లయ్య, రాజు నాయుడు, ఆంజనేయులు, మద్దిలేటి, శ్రీ రాములు, ఎండి.మాజ్, తదితరులు పాల్గొన్నారు.