బిజినేపల్లి, ఫిబ్రవరి 8 : మండలంలోని వట్టెం నవోదయ జవహార్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి గా నూ 9,11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కో సం శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్ర శాంతంగా ముగిసినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ భాస్కర్కుమార్ తెలిపారు. 11వ తరగతి ప్రవేశం కోసం 3,369 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 2733 మంది హాజరై 536 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.
అదేవిధంగా 9వ తరగతి ప్రవేశ పరీక్షకు సంబంధించిన 1,647మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకో గా, 1,327 మంది విద్యార్థులు హాజరై 319 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. రెం డు ప్రవేశ పరీక్షలకోసం 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 11వ తరగతికి సంబంధించిన 14పరీక్షా కేంద్రాలు, 9వ తరగతి ప్రవేశ పరీక్షకు సంబంధించి 6పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్కర్నూల్, అచ్చంపేట, బిజినేపల్లి మండలాల్లోని జవహార్ నవోదయ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలను రెవెన్యూ, విద్యాశాఖాధికారులు తనిఖీ చేసినట్లు తెలిపారు.