మహబూబ్నగర్, జనవరి 1 : నేటి నుంచి ఈనెల 31వతేదీ వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్టు కమిషనర్ ఎం.కిషన్ అన్నా రు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లిలోని జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులకు రోడ్డు భద్రతపై అవగాహన, ఆర్టీసీ, ఆటోడ్రైవర్లకు సదస్సులను ఏర్పాటు చేసి ప్రమాదాలను ఆరికట్టడం, వాహనా లు నడపడం, ఆతివేగం వల్ల దుష్పరిణామాలు, ఆ తర్వా త ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందనే అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు.
రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు నిరంతరం వాహన తనిఖీలు చేపడుతున్నామన్నారు. తాగి వాహనాలు నడిపేవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని ఇంకా పర్యవేక్షణ పెంచి ప్రమాదాలు త గ్గించేందకు ప్రయత్నిస్తామని తెలిపారు. రోడ్డు నిబంధన లు పాటించి వాహనాలు నడిపితే ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకునేందుకు అవకాశం ఉండదన్నారు. సమావేశంలో ఎంవీఐ రఘుకుమార్, ఆర్టీఏ అధికారులు ఉన్నారు.