మహబూబ్‌నగర్ అర్బన్, ఫిబ్రవరి 6 : భారత్ మాల రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహరం ఇవ్వాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. నా రాయణపేట్ జిల్లాలోని మూడు మండలాల కు చేందిన భూ నిర్వాసితులు గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జా తీయ రహదారుల కార్యాలయానికి ర్యాలీగా చేరుకొని 3 గంటలపాటు నిరసన చే పట్టారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితుడు రామలింగం మాట్లాడుతూ ఆ రేం డ్ల కిందట 19 గ్రా మాల నుంచి 3 వేల మందితో భూమి సేకరించి ఒక్కరూపాయి కూ డా ఇవ్వలేదని మండిపడ్డారు. మా భూములు మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తే నేషనల్ హైవే అధికారులు కేసులు వేసి రెండేళ్లు నష్టపరిహారం నిలివేశారని వాపోయారు.
బాధితులు కోర్టును అశ్రయించగా కే సును కొట్టేసిందన్నారు. రెండేళ్ల కిందట నా రాయణపేట్ కలెక్టర్ అవార్డును ఆమోదించగా.. ప్రాజెక్ట్ డైరెక్టర్ నిర్లక్ష్యం వల్ల తమకు రావలసిన అ వార్డు నిలిచిపోయాయని మండిపడ్డారు. అవార్డులపై ఆ ఫీసర్లు తప్పు డు కేసు వే సి రెండేళ్లు కాలయాపన చేయడంతో మేము నష్టపోయామని అందుకు ప్రస్తుతం ఉన్న భూమిరేటు ప్రకారమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చే శారు. 2019న తమ భూములను పీవోబీలో ఉంచడంతో అమ్ముకోలేక, మార్ట్గేజ్ చేయలేక ఆర్థిక ఇబ్బందులతో దాదాపు 8మంది బాధితులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చే శా రు.
ప్రాణాలు కోల్పోయిన భూ బాధిత కు టుంబాలను ప్రభుత్వమే అదుకోవాలని, రో డ్డు నిర్మాణంలో కోల్పోయిన గుడులు, మసీదులు, చర్చిలను ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసుల సహకారంతో ప్రాజెక్ట్ డైరెక్టర్ హిమాన్షుగుప్తా బయటకు వచ్చి మీకు త్వరలోనే అవార్డు అందుతుందని నచ్చజెప్పే ప్రయత్నం చేశా రు. నష్టపరిహారం విషయంలో ఆరేండ్లుగా ఇదే మాట చెబుతున్నారని, స్పష్టంగా ఎప్పు డు ఇస్తారో చెప్పాలని పట్టుబట్టారు. దీంతో పీడీ నెలరోజుల్లో పరిహారం అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో నిర్వాసితులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో కృష్ణయ్య, ప్రసాద్, గోవర్ధన్‌గౌడ్, రవి, వెంకటేశ్, ఉదయ్‌కుమార్, పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.