క్రీడారంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జాతీయస్థాయి ఫాస్ట్-5 మహిళ, పురుషుల నెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు.
- దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి
- పాలమూరులో అట్టహాసంగా జాతీయస్థాయి ఫాస్ట్-5 నెట్‌బాల్ టోర్నీ
మహబూబ్‌నగర్ టౌన్, జనవరి 13 : రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జాతీయస్థాయి ఫాస్ట్-5 మహిళ, పురుషుల నెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. టోర్నీని ఎమ్మెల్యేతోపాటు నెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ విజేందర్‌సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలమూరు జాతీయస్థాయి టోర్నీకి వేదిక కావడం, 28 రాష్ర్టాల క్రీడాకారులు ఇక్కడికి రావడం హర్షించదగ్గ విషయమన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, చండీఘడ్, ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా, హిమచల్‌ప్రదేశ్, జమ్ముకాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, నాగలాండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ జట్లు పాల్గొన్నాయి. తొలి రోజు పురుషుల విభాగంలో జరిగిన మ్యాచ్‌లో హర్యానా జట్టు 44-22 తేడాతో ఆంధ్రప్రదేశ్‌పై విజయం సాధించింది. మహిళా విభాగంలో జరిగిన మ్యాచ్‌లో ఏపీపై 29-11 తేడాతో బీహార్ గెలుపొందింది. మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. కార్యక్రమంలో రాష్ట్ర నెట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సురేశ్‌కుమార్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విక్రమాదిత్యరెడ్డి, ఖాజాఖాన్, ఉపాధ్యక్షుడు సాదత్‌ఖాన్, ట్రెజరర్ సోహెల్ ఉర్ రెహమాన్, నాయకులు ఆనంద్‌గౌడ్, వినోద్‌కుమార్, అక్షదీప్రెడ్డి, సిరాజ్‌ఖాద్రీ, లక్ష్మణ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

