మహబూబ్‌నగర్ టౌన్, జనవరి 14 : జిల్లా నెట్‌బాల్ అ సోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో నేషనల్ ఫాస్ట్-5 సీనియర్ మహిళా, పురుషుల నెట్‌బాల్ చాంపియన్‌షిప్ హోరాహోరీగా కొనసాగుతున్న ది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పురుషుల విభాగంలో తెలంగాణ జట్టు 21-5తో ఉత్తరాఖండ్‌పై గెలువగా, మహిళల విభాగం లో తెలంగాణ జట్టు 30- 05తో బెంగాల్‌పై గెలిచి శుభారం భం చేశాయి. పురుషుల విభాగంలో కేరళ జట్టు 32-12తో తమిళనాడుపై,
ఛత్తీస్గడ్ జట్టు 25-22తో బీహార్‌పై, కర్ణాటక జట్టు 31-14తో మహారాష్ట్రపై, గోవా జట్టు 27-15తో పుదుచ్చేరిపై, ఉత్తరప్రదేశ్ జట్టు 30-13తో మధ్యప్రదేశ్‌పై, హర్యానా జట్టు 44-22తో ఆంధ్రప్రదేశ్‌పై, జమ్మూకశ్మీర్ జట్టు 24-10తో తమిళనాడుపై, ఆంధ్రప్రదేశ్ జట్టు 28-14తో బెంగాల్‌పై గెలిచాయి. మహిళా విభాగంలో తమిళనాడు జట్టు 25-18 తో పుదుచ్చేరిపై, కర్ణాటక జట్టు 20-12తో మహారాష్ట్రపై, బీహార్ జట్టు 29-11తో ఆంధ్రప్రదేశ్‌పై, ఢిల్లీ జట్టు 14-10తో రాజస్థాన్‌పై, హిమాచల్‌ప్రదేశ్ జట్టు 22-16తో బీహార్‌పై, పంజాబ్ జట్టు 19-14తో ఉత్తరప్రదేశ్‌పై, కేరళ జట్టు 31-05తో మధ్యప్రదేశ్‌పై, రాజస్థాన్ 22-21తో తమిళనాడుపై గెలిచాయి.
పట్టుదల క్రమశిక్షణతో ఆడితేనే క్రీడల్లో రాణిస్తారని నెట్‌బాల్ ఫెడరేషన్ ఎంపైర్ బోర్డు చైర్మన్ అశోక్ఆనంద్ అన్నారు. ఇండోర్ స్టేడియంలో నేషనల్ ఫాస్ట్-5, మహిళా, పురుషుల నెట్‌బాల్ చాంపియన్‌షిప్ టోర్నీ రెండో రోజు పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ టోర్నీ వివిధ రాష్ర్టాల జట్ల క్రీడాకారులు టోర్నీలో చక్కటి ప్రతిభ చాటాలన్నారు.
నెట్‌బాల్ క్రీడలో రాణించే క్రీడాకారులకు క్రీడా కోటలో పోస్టల్, పోలీస్, సెం ట్రల్ ఎక్సైజ్, ఇన్‌కం టాక్స్ శాఖలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు. కార్యక్రమంలో టోర్నీ చైర్మన్ అమిత్అరోరా, కన్వీనర్ అకాశ్బత్రా, నెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆదిత్యరెడ్డి, ఖాజాఖాన్, ఉపాధ్యక్షుడు సాదత్‌ఖాన్, ట్రెజరర్ సోహెల్, రామ్మోహన్, అంజద్ పాల్గొన్నారు.