Teacher | విద్యార్థినితో వెకిలి చేష్టలు.. మీడియాకు ముఖం చాటేసి టీచర్ పరుగులు.. వీడియో
Teacher | నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం మోమినపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో స్వామి అనే తెలుగు ఉపాధ్యాయుడు విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు.
Teacher | విద్యార్థులకు క్రమశిక్షణతోపాటు విద్యాబుద్దులు నేర్పించాల్సిన టీచర్ ఆ విషయాన్ని మరిచిపోయాడు. తాను చదువు చెప్పే స్కూల్లో విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నకొడంగల్ నియోజకవర్గంలో చోటుచేసుకోవడం గమనార్హం.
నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం మోమినపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో స్వామి అనే తెలుగు ఉపాధ్యాయుడు విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. సదరు విద్యార్థినిని టీచర్ స్వామి ఈ నెల 7వ తేదీన కంప్యూటర్ ల్యాబ్‌కు పిలిపించుకుని వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు, ఈ విషయం బయటికి రాకుండా ఉండేందుకు ఎంఈవో, ప్రధానోపాధ్యాయుడు, గ్రామ పెద్దలు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు స్కూల్‌కు వెళ్లడంతో టీచర్ స్వామి వారితో మాట్లాడకుండా భయంతో పరుగులు పెడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రౌండప్ చేస్తోంది.
ఉపాధ్యాయుడి సస్పెన్షన్..
మద్దూరు మండలం ఎంపీహెచ్ఎస్ మోమినాపూర్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన స్వామి అనే తెలుగు ఉపాధ్యాయుడిని ఎంక్వైరీ అధికారుల విచారణ నివేదిక మేరకు విధులనుంచి సస్పెన్షన్ చేసినట్టు డీఈఓ గోవిందరాజు ప్రకటనలోతెలియజేశారు.
విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కీచక టీచర్
కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం మోమినపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన స్వామి అనే ఉపాధ్యాయుడు
ఈ నెల 7వ తేదీన కంప్యూటర్ ల్యాబ్‌కు పిలిపించుకుని వెకిలి చేష్టలకు పాల్పడిన… pic.twitter.com/2vzMLZzJU0
— Telugu Scribe (@TeluguScribe) March 26, 2026
Read Also :
4 ఇన్క్లైన్లో హైమాస్ట్ లైట్లు బంద్ చేసే వారే లేరా?
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి : నల్లగొండ డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ అలీ
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

