ఇసుక అక్రమ దందాలకు పాల్పడితే కఠిన చర్యలు :తసీల్దార్ అబ్దుల్ రహమాన్
ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక, మట్టి( మొరం), వండ్రు మట్టి దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ అబ్దుల్ రెహమాన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
మాగనూరు మే 31: నారాయణపేట జిల్లా మాగనూరు మండల పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక, మట్టి( మొరం), వండ్రు మట్టి దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ అబ్దుల్ రెహమాన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతులు లేకుండా మండలంలో అక్రమ వ్యాపారం చేస్తున్న వారు తమ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన మేరా ఇసుక, మట్టి, ఒండ్రు మట్టికి ప్రభుత్వపరంగా అనుమతులు ఇస్తామన్నారు.
కావున అవసరమైన లబ్ధిదారులు ట్రాక్టర్, టిప్పర్ల యజమానులు అనుమతులు పొందాలని తెలిపారు. ప్రభుత్వ ఆదాయానికి గండిపడే విధంగా వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక అనుమతులు పొందుతున్న ట్రాక్టర్ యజమానులు నిజమైన లబ్ధిదారులకు ఇసుక సరఫరా చేయకుండా ఎక్కువ డబ్బులకు బయట వారికి అమ్ముకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. లబ్ధిదారులకాకుండా ఇసుక పక్క దారి పట్టిస్తున్న ట్రాక్టర్స్ను సీజ్ చేస్తామన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

