మరికల్ : మరికల్ మండలంలోని పస్పుల కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అగ్రికల్చర్ క్రాప్ ప్రోడక్ట్ కోర్సుల్లో 20 సీట్లు ఖాళీగా ఉన్నాయని, మంగళవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు పాఠశాల ఎస్ఓ రాజ్యలక్ష్మి తెలిపారు.
పదో తరగతి ఉత్తీర్ణులైన బాలికల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని రాజ్యలక్ష్మి చెప్పారు. మంగళవారం ఉదయం స్పాట్ అడ్మిషన్లతో ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుందని అన్నారు. ఆసక్తి గల బాలికలు కేజీవీబీ పాఠశాల దగ్గరకు రాగలరని కోరారు.