ఊట్కూర్, అక్టోబర్ 1: పేద ప్రజల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మాజీ మంత్రి స్వర్గీయ ఎల్కోటి ఎల్లారెడ్డి సేవలు చిరస్మరణీయమని పలువురు నాయకులు కొనియాడారు. ఆయన 87వ జయంతి వేడుకలను గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి చిత్రపటానికి అభిమానులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దవాఖానాలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు.
ప్రజా సేవలో ఎల్లారెడ్డి అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సూర్యప్రకాశ్‌రెడ్డి, అరవింద్‌కుమార్, మన్నెమ్మ, శివరామరాజు, జగదీష్‌గౌడ్, గోపాల్ రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, యజ్ఞేశ్వర్‌రెడ్డి, నీల్ రాజ్, రాజశేఖర్, వెంకటేష్, అశోక్ బాబు, వాజిద్పాషా, శమీ, అశోక్ తోపాటు ఎల్లారెడ్డి తనయులు జనార్దన్‌రెడ్డి, నారాయణరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, సోదరుడు మల్రెడ్డి, అభిమానులు పాల్గొన్నారు.