మరికల్, మే 29: మరికల్ (Marical) మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గురువారం తెల్లవారుజామున గోడకూలి 6 మేకల మృత్యువాత పడ్డాయి. గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు పాత కోడలు కూలి పక్కన ఉన్న మేకలపై పడడంతో కొండేటి తిరుమలయ్యకు చెందిన ఆరు మేకలు మృతి చెందడం జరిగింది. జీవనోపాధికై మేకలను పెంచుతున్న తిరుమలయ్య మేకలు మృతి చెందడం పట్ల ఆయనకు సుమారు లక్షల 50 వేల రూపాయల నష్టం వాటిల్లిందని కాలనీవాసులు తెలిపారు. ప్రభుత్వం తిరుమలయ్య కుటుంబాన్ని ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని కోరారు. తిరుమలయ్యను మాజీ ఉపసర్పంచ్ శివకుమార్‌తోపాటు పలువురు పరామర్శించారు.