Check Post : నారాయణపేట జిల్లా కర్ణాటక సరిహద్దుల్లోని కృష్ణ బ్రిడ్జ్ వద్ద 24 x7 పర్మినెంట్ చెక్‌పోస్ట్ (Check Post) ఏర్పాటు చేశామని ఎస్ఐ ఎస్ఎం నవీద్ తెలిపారు. జిల్లా ఎస్పీ వినీత్ ఉత్తర్వుల మేరకు చెక్‌పోస్ట్ పెట్టామని ఆయన చెప్పారు. అనధికారిక వాహనాలు, మద్యం, గంజాయి.. వంటివి చట్ట విరుద్ధంగా జిల్లాలోకి రాకుండా నివారించడానికి, దొంగతనాలను అడ్డుకోవడానికి చెక్‌పోస్ట్ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
ఇకనుంచి కృష్ణ బ్రిడ్జ్ వద్ద ప్రతిరోజు వాహనాల తనిఖీలు చేపడుతామని ఎస్ఐ వెల్లడించారు. అలాగే చెక్‌పోస్ట్ వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. సీసీ కెమెరాలు, లైటింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా 24 గంటల షిఫ్ట్‌ల వారీగా పోలీసులను నిమమించామని ఎస్ఐ నవీద్ పేర్కొన్నారు.