నారాయణపేట టౌన్, జనవరి 1 : పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో నూతన ఏడాది వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. కలెక్టర్ హరిచందన ఎస్పీ వెంకటేశ్వర్లుతో కలి సి శనివారం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వి విధ శాఖల అధికారులు కలెక్టర్‌కు పుస్తకాలు అందజేసి నూ తన ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు జి ల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ వెంకటేశ్వర్లు కలెక్టర్‌ను మర్యాదపూర్వరంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో నర్సింగరా వు, ఖలీద్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఎస్పీ మధుసూదన్రా వు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉత్సాహంగా …
కొత్త ఆశలతో పట్టణ ప్రజలు నూతన ఏడాదికి స్వాగతం పలికారు. శుక్రవారం రాత్రి 12గంటల వరకు యువకులు, చిన్నారులు రోడ్లపై, వీధుల్లోకి చేరుకొని కేరింతలు కొడు తూ, పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కేక్ కట్ చేసి నూతన ఏడాది శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మహిళలు కుటుంబ సభ్యులతో ఇండ్లల్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
న్యూ ఇయర్ వేడుకలు
నూతన సంవత్సర సంబురాలను పట్టణవాసులు ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకొన్నారు. శు క్రవారం రాత్రి 12 గంటలకు కేక్‌లు కట్ చేసి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. యువకులు, మహిళలు, చిన్నారులు ఇంట్లో నృ త్యాలు, డ్యాన్స్‌లు చేశారు. శనివారం ఇండ్ల ఎదుట 2022 స్వాగతం పలుకుతూ రంగవల్లులు తీర్చిద్దిదారు. దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున నుంచే భక్తులు అలయాలను సందర్శించి నూతన సంవత్స రం బాగుండాలని ప్రత్యేక పూజలు చేశారు.
నారాయణపేట మండలంలో..
మండలంలోని జాజాపూర్, కోటకొండ, కొల్లంపల్లి, సింగారం, అప్పక్‌పల్లి తదితర గ్రామాల్లో నూతన సంవత్సర వేడుకలను శుక్రవారం రాత్రి ఘనంగా జరుపుకొన్నారు. కేక్ కట్ చేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. శనివారం జాజాపూర్ ఎస్బీఐ బ్యాంక్‌లో కస్టమర్ల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.
ధన్వాడ మండలంలో..
మండలకేంద్రంతోపాటుగా వివిధ గ్రామాల్లో శుక్రవారం రాత్రి నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎలాంటి ఘటనలు జరుగకుండా ఎస్సై రాజేందర్ ఆదేశాల మేరకు పోలీసులు బందోబస్తు నిర్వహించి పెట్రోలింగ్ నిర్వహించా రు. శనివారం ఆయా గ్రామాల్లోని ఆలయాలను దర్శించుకున్నారు.
మరికల్ మండలంలో..
గతకాలపు జ్ఞాపకాలు పదిలం… నిన్నటి తరం ముగిసింది. కొత్త సంవత్సరానికి తెరలేచింది. గతంలో జరిగిన మధుర జ్ఞాపకాలన్ని నెమరువేసుకుంటునే కొత్త ఆశయాలతో నూతన సంవత్సరానికి ఆటపాటలతో ఆనందోత్సవాల మధ్య ఘనంగా స్వాగతం పలికారు. 20 21లో జరిగిన అభివృద్ధి కంటే 2022లో మరింత అభివృద్ధి సాధించాలనే ఆశయాలతో పల్ల్లెలు ఎదురు చూస్తున్నాయి. గతేడాది ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ నుంచి ప్రపంచం నూతన సంవత్సరంలో కోలుకోవాలన్నా రు. శుక్రవారం రాత్రి కేరింతల మధ్య యువకులు, వృద్ధు లు, మహిళలు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.