Utkoor | బైక్‌పై ఇంతమందా?.. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని దండం పెట్టి వేడుకున్న పోలీస్..!
ఊట్కూర్, ఆగస్టు 28: ద్విచక్ర వాహనంపై పరిమితికి మించి ప్రయాణిస్తున్న కుటుంబాన్ని ఓ పోలీసు అధికారి వారించారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం ఈ ఆసక్తికర సంఘటన జరిగింది.
ఊట్కూర్, ఆగస్టు 28: ద్విచక్ర వాహనంపై పరిమితికి మించి ప్రయాణిస్తున్న కుటుంబాన్ని ఓ పోలీసు అధికారి వారించారు. వారిని ఆపిన ఆయన.. బైక్‌పై ఇంతమంది వెళ్లడం ప్రమాదకరమని అవగాహన కల్పించారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం ఈ ఆసక్తికర సంఘటన జరిగింది.
ఊట్కూర్ మండల కేంద్రంలోని చెక్ పోస్ట్ వద్ద ఒకే ద్విచక్ర వాహనంపై చిన్నారితో సహా ఐదుగురు వెళ్లడాన్ని హెడ్ కానిస్టేబుల్ రంజిత్ కుమార్ గమనించారు. బైక్ మీద పరిమితికిమించి ప్రయాణించడం సరికాదని వారిని ఆయన వారించారు. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని వారికి రజింత్ కుమార్ వివరించారు.
అంతేకాదు దయచేసి బైక్‌పై ఇద్దరికి మించి వెళ్లొద్దని.. దండం పెట్టి మరీ వేడుకున్నాడు. బండిపై వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించాలని, ద్విచక్ర వాహనంపై పరిమితికి మించి ప్రయాణించవద్దని, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని రజింత్ కుమార్ వారికి సూచించారు. పోలీసు అధికారి వినూత్న రీతిలో అవగాహన కల్పించిన దృశ్యం అక్కడి వారిని ఆలోచింపజేసింది. ప్రమాదాల నివారణలో వాహనదారులు బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు కోరుతున్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

