మరికల్ : మరికల్ మండలంలోని అప్పంపల్లి గ్రామ శివారులో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్, మరికల్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నట్లు మరికల్ ఏఎస్ఐ ఎల్లయ్య తెలిపారు. శనివారం మధ్యాహ్నం పక్క సమాచారంతో ఈ దాడులు నిర్వహించారు.
ఐదుగురు వ్యక్తులు రూ.6,600 పందెం కట్టి పేకాట ఆడినట్లు పోలీసులు తెలిపారు. ఐదు సెల్ ఫోన్లతోపాటు రూ.6,600 లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఐదుగురు వ్యక్తులపై గేమింగ్ యాక్ట్ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు మరికల్ ఏఎస్ఐ ఎల్లయ్య తెలిపారు.