Drinking water | గుక్కెడు నీటి కోసం గుండెలవిసే ఆవేదన ..తాగునీటి కోసం రోడ్డెక్కిన జనం
ప్రజలకు కనీసం గుక్కెడు తాగునీరు అందించాల్సిన పాలకులు ఆ బాధ్యతను విస్మరించడంతో ప్రజలు రోడ్డెక్కాల్సిన దుస్థితి గురువారం ఉదయం మక్తల్ మున్సిపాలిటీలో చోటుచేసుకుంది.
మక్తల్, నవంబర్ 12 : ప్రజలకు కనీసం గుక్కెడు తాగునీరు అందించాల్సిన పాలకులు ఆ బాధ్యతను విస్మరించడంతో ప్రజలు రోడ్డెక్కాల్సిన దుస్థితి గురువారం ఉదయం మక్తల్ మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలోని ఐదవ వార్డులోని నందిని నగర్ తో పాటు, మంచినీటి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. కాలానీలో నిత్యం తాగునీటి సమస్యతో అల్లాడుతున్న ప్రజలు, చివరకు సహనం కోల్పోయి రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కాలానీ వాసులు మాట్లాడుతూ.. తమకు తాగునీరు అందించాలని, సమస్యను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకవైపు అభివృద్ధి చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకునే పాలకులు, మరోవైపు ప్రజలకు కనీస తాగునీరు,అందించలేకపోవడం పాలనాపరమైన వైఫల్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. వేసవైనా, వర్షాకాలమైనా తాగునీటి సమస్య మాత్రం ప్రజలను వెంటాడుతూనే ఉందినీ, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో ప్రజలు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపే పరిస్థితి ఏర్పడిందనీ ప్రజలు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తాగునీటి సమస్యకు, శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drinking water | గుక్కెడు నీటి కోసం గుండెలవిసే ఆవేదన ..తాగునీటి కోసం రోడ్డెక్కిన జనం
గుడిసెలో ఆకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. సకాలంలో స్పందించిన పోలీసులు, 108 సిబ్బంది
Jailer 2 | ఓటీటీలోకి వచ్చేసిన రజనీకాంత్ ‘జైలర్ 2’.. కాని ఆ విషయంలో అభిమానులకు బిగ్ షాక్.. !
Jensen Huang: మరో ఉద్యోగితో రిలేషన్.. జేన్సన్ హువాంగ్‌పై వేటుకు ఎన్‌వీడియో బోర్డు సిద్ధం!
Sharwanand | డిసెంబర్ 11న బరిలోకి శర్వానంద్ భోగి.. పోటీలో మరో మూడు సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

