నారాయణపేట జిల్లాలోని ఉట్కూరులోని ఓ ఇంట్లో వెండి నాణేలు బయటపడ్డాయి. పాత ఇంటిని కూలగొడుతుండగా.. వెండి నాణేలు బయటపడ్డాయి. గోడలను కూలగొట్టగా.. వాటి మట్టిలో వెండి నాణేలు బయటపడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న కొందరు స్థానికులు వాటిని తీసుకెళ్లిపోయినట్టు సమాచారం. ఈ ఘటన గురించి తెలుసుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.