నారాయణపేట టౌన్, ఫిబ్రవరి 10 : తల్లిదండ్రులు ఆ డ, మగ అనే తేడా లేకుండా తమ పిల్లలను పెంచి, ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఉమాదేవియాదవ్ అన్నారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లాస్థాయి అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. స మాజంలో జరుగుతున్న ఆకృత్యాలతో పోరాడేందుకు మ హిళలు ముందుకు రావాలని, ఇతర మహిళలకు సహాయం చేసే సంఘటిత శక్తిని అలవర్చుకోవాలన్నారు. బాలికలకు పెండ్లిళ్లు చేసేందుకు వారి ఆధార్ కార్డుల్లో వయస్సును మా రుస్తున్నారని అలాంటి వాటిని అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సమాజంలో మహిళలతో ఎలా ప్రవర్తించాలో చిన్నప్పటి నుంచే అబ్బాయిలకు అవగాహన కల్పించాలన్నారు. మహిళలకు తమ హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళలు కమిషన్‌కు ఎ లాంటి ఫిర్యాదులు చేసినా వారి వివరాలు గోప్యంగా ఉం చాలన్నారు. కమిషన్ పూర్తిస్థాయిలో మహిళలకు అండగా ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ మహిళలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రభుత్వం అందిం చే ప్రతి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అదనపు కలెక్టర్ పద్మజారాణి మా ట్లాడుతూ జిల్లాలో మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పా టు చేయడం జరిగిందని, మహిళలు తయారు చేసిన వస్తువులను అరుణ్య పేరుతో విక్రయిస్తున్నారని వివరించా రు. పురుషులతో సమానంగా పనిచేసి ఆర్థికంగా లాభాలు ఆర్జిస్తున్నారని స్ప ష్టం చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ గోపాల్‌నాయక్, జెడ్పీ సీఈవో సిద్ధిరామప్ప, సీఐ ఇఫ్తెకార్ అహ్మద్, డీఐవో శైలజ తదతరులు పాల్గొన్నారు.
మహిళలపై వివక్ష వద్దు
మహిళలపై వివక్ష వద్దని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఉమాదేవియాదవ్ అన్నారు. మండలకేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, వేధింపులాంటి విషయాలపై తమ దృష్టికి తీసుకువస్తే చట్యరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు అమృతహారం, గర్భిణులకు పౌష్టికాహారం అందించ డం జరుగుతుందన్నారు. పిల్లల ఎదుగుదలపై అధికారుల ను అడిగి తెలుసుకున్నారు. మహిళలపై ఎవరైనా అనుచితంగా వ్యవహరిస్తే 181 నంబరుకు ఫోన్ చేస్తే సిబ్బంది మీ వద్దకు వచ్చి సాయం చేస్తారన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో వేణుగోపాల్, ఎంపీపీ విజయలక్ష్మి, సర్పంచ్ అరు ణ, జిల్లా సఖి కేంద్రం అధికారులు, అంగన్వాడీ కార్యకర్త లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.