కోయిలకొండ, మే 2 : మండలంలో కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులకు, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు, జర్నలిస్ట్‌లకు ఆదివారం సెంట్రింగ్ మేస్త్రీ కుమ్మరి రాములు ఆదివారం బియ్యం, గుడ్లు, పండ్లు పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని ఆది ఆంజనేయస్వామి ఆలయంలో ప్రైవేట్ పాఠశాల టీచర్లు, మీడియా మిత్రులకు 25 కేజీల సో నా బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ కొవిడ్ వచ్చిన వారికి సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో దాతలు ముందుకొచ్చి పేదలను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో రామన్నపల్లి సర్పంచ్ వెంకటేశ్, వింజమూర్ ఉపసర్పంచ్ భీమయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరు మృతి
మూసాపేట(అడ్డాకుల), మే 2: కరోనా వ్యాధితో ఇద్దరు మృతి చెం దారు. అడ్డాకుల మండలంలోని రాచాల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు సు దర్శన్(62)కు 10 రోజుల కిందట కరోనా వైరస్ సోకింది. పరిస్థితి విషమంగా ఉండడంతో నాలుగు రోజుల కిందట జిల్లా దవాఖానకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెం దారు. వైద్య సిబ్బందే రాచాలకు తీసుకొచ్చి వా రి వ్యవసాయపొలంలో అంత్యక్రియలు చేశా రు. అదేవిధంగా మూసాపేట మండల కేంద్రానికి చెందిన వెల్డింగ్ డీఆర్ కృష్ణయ్య(48) కరో నా సోకడంతో హైదరాబాద్‌లో చికిత్స పొందు తూ మృతి చెందారు. అతడి మృతదేహాన్ని స్వ గ్రామమైన మూసాపేటకు అంబులెన్స్‌లో తీసుకొచ్చి వైద్య సిబ్బందే అంత్యక్రియలు నిర్వహించారు.