ఊట్కూర్, ఆగస్టు 19: అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు నారాయణపేట జిల్లాలోని ఊట్కూర్ పెద్ద చెరువుకు వరద నీరు చేరి నిండుకుండను తలపిస్తోంది. జిల్లాలోనే అత్యంత విస్తీర్ణం కలిగి 800 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే సామర్థ్యం ఉన్న ఊట్కూర్ పెద్ద చెరువు పూర్తిస్థాయిలో నిండి మత్తడి దుంకుతోంది. మంగళవారం గ్రామస్తులు మేళ తాళాలతో పెద్ద చెరువువును సందర్శించి గంగా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అలుగు నీటిలో వరద పాయసం పోసి పాడి పంటలు, మత్స్య సంపదతో గ్రామం సుభిక్షంగా ఉండాలని గంగామాతను వేడుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎం.భాస్కర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విగ్నేశ్వర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎం.భరత్ కుమార్, గ్రామ మత్స్యకారుల సహకార సంఘం అధ్యక్షులు వెంకట్రాములు, ప్రధాన కార్యదర్శి వసంత్ కుమార్, రవికుమార్, ఎం.అశోక్, కుంటిమారి రాఘవేందర్ నాయుడు, చాపలి రోషినప్ప, సూరం ప్రకాష్, ముద్దం రాము, తిరుపతి, ఊషప్ప, రామ్ చందర్, కుంటిమారి రాకేష్, గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి జగదీష్ గౌడ్, అడ్వకేట్ భరత్ కుమార్ పాల్గొన్నారు.