క్యాతనపల్లిలో అరాచకం.. పోలీసులు, అధికారులను అడ్డం పెట్టుకొని చైర్మన్ ఎన్నిక వాయిదా
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగకుండా కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు తెరలేపింది. పోలీసులు, అధికారులను అడ్డం పెట్టుకొని పక్కా పథకం ప్రకారం చైర్మన్ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేసింది.
- బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు మున్సిపాలిటీకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
- మధ్యాహ్నం 12 గంటలకే కౌన్సిల్‌ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన తహసీల్దార్
మంచిర్యాల, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగకుండా కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు తెరలేపింది. పోలీసులు, అధికారులను అడ్డం పెట్టుకొని పక్కా పథకం ప్రకారం చైర్మన్ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేసింది. క్యాతనపల్లిలో 144వ సెక్షన్ అమల్లో ఉన్నదని చెప్పిన పోలీసులు, ఏకపక్షంగా అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలికారు. వందలాది మంది కాంగ్రెస్ నాయకులతోపాటు స్థానికేతరులను క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ సమీపంలోకి అనుమతించిన పోలీసులు.. బీఆర్ఎస్, సీపీఐ నుంచి గెలిచిన కౌన్సిలర్లు, నాయకులను మున్సిపాలిటీకి రాకుండా అడుగడుగునా అడ్డుకున్నారు.
క్యాతన్‌పల్లిలోని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఇంటి నుంచి ఉదయం 11.20 గంటలకు మున్సిపాలిటికీ బయల్దేరిన కౌన్సిలర్లను రామకృష్ణాపూర్ ైప్లెఓవర్ ముందే ఆపేశారు. దీంతో బాల్కసుమన్, స్థానిక నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. దాదాపు అరగంట సమయం వృథా అయ్యాక వదిలారు. అనంతరం ఫ్లైఓవర్‌కు కింది భాగంలో మున్సిపాలిటీకి వెళ్లే మార్గంలో మరోసారి అడ్డుకున్నారు. కేవలం కౌన్సిలర్లు మాత్రమే వెళ్లాలని, మిగిలిన నాయకులు వెళ్లొదని ఆంక్షలు విధించారు.
లోపలున్న కాంగ్రెస్ నాయకులను బయటికి పంపిస్తే కౌన్సిలర్లు మాత్రమే వెళ్తారని, లేదంటే తామందరినీ అనుమతించాల్సిందేనని బీఆర్ఎస్, సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఇలా ఇక్కడ కాసేపు వాగ్వాదం జరిగేలోపు మధ్యాహ్నం 12 గంటలకు గెలిచిన కౌన్సిలర్లు ఎవ్వరూ రాలేదని, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్టు ఎమ్మార్వో సతీశ్ ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు మున్సిపాలిటీకి వెళ్లకుండానే వెనుతిరిగి వెళ్లిపోయారు. పక్కా పథకం ప్రకారం ఎలాగైనా ఎన్నికను వాయిదా వేయాలనే ఉద్దేశంతో పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తున్నది.
వెంకటస్వామి పరువు తీస్తున్నారు : బాల్కసుమన్
పోలీసుల తీరుపై బాల్కసుమన్ మండిపడ్డారు. ప్రజాతీర్పును గౌరవించకుండా మంత్రి వివేక్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. గూండాయిజం, రౌడీ రాజకీయాలు చేస్తున్న మంత్రి వివేక్ ఆయన తండ్రి కాకా వెంకటస్వామి పరువు తీస్తున్నారని విమర్శించారు. తాము ప్రజా తీర్పునకు కట్టుబడి ఉన్నామని, వివేక్ సైతం కట్టుబడి ఉండాలని హితవు చెప్పారు. సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేని శంకర్, బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

