నారాయణపేట, ఫిబ్రవరి 10 : దామరగిద్ద మండలంలోని పలు గ్రా మాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందకు సీడీపీ నిధు లు మంజూరు కాగా, అం దుకు సంబంధించిన మంజూరు పత్రాలను పేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి పంపిణీ చేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులకు గురువారం అందజేశారు. లింగారెడ్డిపల్లి గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి మంజూరైన రూ.7.50లక్షలు, నర్సాపూర్‌లో ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి మంజూరైన రూ.9 లక్షలు, ఆశన్‌పల్లిలో పాఠశాల మరమ్మతులకు మంజూరైన రూ.5లక్షలు, కంసన్పల్లిలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంజూరైన రూ.6లక్షలు, అంగన్వాడీ కేంద్ర నిర్మాణానికి మంజూరైన రూ.4లక్షలకు సంబంధించిన మంజూరు పత్రాల ను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరు లు పాల్గొన్నారు.
బాలాజీస్వామి జాతర వాల్‌పోస్టర్ విడుదల
మండలంలోని ఎక్లాస్పూర్ బాలాజీస్వామి ఉత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను గురువారం పేట ఎ మ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి క్యాంపు కార్యాలయం లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఈనెల 14న నిత్యపూజ, అలంకరణ, అభిషేకం, 15న ప్ర భోత్సవం, 16న సుప్రభాతం, అభిషేకం, కల్యా ణం, రథోత్సవం, రెట్టపట్లు, 17న పాల ఉట్ల ఉత్సవాలు, 18న సత్యనారాయణస్వామి వ్రతం, పూ జారి ఇంటికి ఉత్సవ మూర్తుల తరలింపు ఉంటాయని ఆలయ కమిటీ చైర్మన్ హరినారాయణ భ ట్టడ్, ఈవో సత్యనారాయణ నాయుడు తెలిపారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారి కృ పకు పాత్రులు కావాలన్నారు. కార్యక్రమంలో స ర్పంచ్ జమునాబాయ్, ఎంపీటీసీ రాంరెడ్డి, పూ జారి మాణిక్శాస్త్రి, వైస్‌చైర్మన్ జగదీశ్పాల్గొన్నారు.