దామరగిద్ద : వర్షాకాలంలో ( Rainy season ) నీరు కలుషితమై సీజనల్ వ్యాధులు ప్రభలుతాయని దామరగిద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీహెచ్వో పీ నారాయణ ( CHO Narayana ) అన్నారు. గురువారం మండలంలోని క్యాతన్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టాప్ డయేరియా ( Stop Diarrhea ) కార్యక్రమములో భాగంగా విద్యార్థులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు , ఆహారం , పరిసరాలు కలిషితం కావడం వలన, విరేచనాలు, టైపాయిడ్, కామెర్లు , తదితర అంటువ్యాధులు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని , పరిశుభ్రమైన నీరు , శుభ్రమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఓఆర్ఎస్ ద్రావణం తయారు చేయు విధానాన్ని, శాస్త్రీయంగా చేతులను శుభ్రం చేసుకునే విధానాన్ని చేసి చూయించారు. ఈ కార్యక్రమములో ప్రధానోపాధ్యాయులు బీ సత్యనారాయణ , ఉపాధ్యాయులు, ఏఎన్ఎం అరుణ , ఆశ వర్కర్లు సుమలత , సుజాత పాల్గొన్నారు.