మరికల్, ఏప్రిల్ 07: నారాయణపే జిల్లా మరికల్‌కు చెందిన యువ క్రీడాకారుడు వేణు జాతీయ స్థాయి కబడ్డీ (Kabaddi) పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం
మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డోకూరు తిరుపతిరెడ్డి, మరికల్ మాజీ సర్పంచ్ కస్పే గోవర్ధన్ క్రీడాకారుడు వేణును శాలువాతో ఘనంగా సన్మానించారు. జాతీయస్థాయిలో మరింత ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో మరికల్ యువకమండలి అధ్యక్షుడు నెల్లికొండి శ్రీకాంత్ రెడ్డి,క్రీడాకారులు ఉడిపి సురేష్, రాజశేఖర్, మహేందర్, మహేష్, సత్యా రెడ్డి, ప్రకాష్, అశోక్, తదితరులు పాల్గొన్నారు. మార్చి 27 నుంచి 30 వరకు జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు బీహార్‌లో జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ జట్టుకు వేణు ప్రాతినిధ్యం వహించారు.