Leopard Attacks | మద్దూర్ కొత్తపల్లి, మార్చ్5 : ఉమ్మడి మద్దూరు మండల పరిధిలోని గ్రామ శివారులలో చిరుత స్వైర విహారం చేస్తూ వరుసగా పొలాల దగ్గర ఉంచిన మూగజీవాలపైన దాడులు చేస్తూ ఉమ్మడి మద్దూరు పరిధిలోని వివిధ గ్రామాలలో రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.
గత ఏడాది కాలంగా పొలాల దగ్గర ఉంచిన జీవాలపై రాత్రుల్లో దాడులకు తెగబడుతున్న ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో రైతులు తమ మూగ జీవాలను కోల్పోతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. అలాగే రైతులు రాత్రులు వ్యవసాయ పొలాల దగ్గరకు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు.
పదుల సంఖ్యలో దాడులు..
గత ఆరు నెలల్లో చిరుతలు మూగజీవాలపై దాదాపు పదుల సంఖ్యలో దాడులు చేయడం జరిగినా.. అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడంతో రైతులు తాము నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత దాడి జరిగిన సందర్భాల్లో ఫారెస్ట్ అధికారులు వచ్చి పరిశీలించిపోవడమే తప్ప చిరుత సంచారాన్ని అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని తాము కోల్పోయిన మూగజీవాల పరిహారం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా మద్దూరు మండల పరిధిలోని మోమినాపూర్ గ్రామానికి చెందిన గుళ్ళ హనుమంతు తన పొలం దగ్గర దూడను కట్టి మంగళవారం రాత్రి ఇంటికి వచ్చాడు. ఇవాళ ఉదయం పొలం దగ్గరికి వెళ్లి చూడగా బర్రె దూడ పై చిరుత దాడి చేసింది గమనించాడు.
Singer Kalpana | వెంటిలేటర్‌పై చికిత్స.. కల్పన హెల్త్ బులెటిన్ విడుదల
Crazy Star Award | రెబ్బెనకు చెందిన దేవర వినోద్‌కు క్రేజీ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
Inter student | పోలీసుల ఔదార్యం.. ఇంటర్ విద్యార్థిని సకాలంలో పరీక్ష కేంద్రానికి తరలింపు