అసెంబ్లీలో 42 శాతం బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం లభించడం పట్ల బుధవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకుడు సూర్య మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. అన్ని పార్టీల మద్దతుతో 42 శాతం బీసీ రిజర్వేషన్ పెంపుకు, ఎస్సీ వర్గీకరణ అమలుకు బిల్లు ఆమోదించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి మరికల్ మండల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు.
మంగళవారం అసెంబ్లీలో మరికల్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని ఎమ్మెల్యే మాట్లాడారన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున కార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్నికా రెడ్డి, నారాయణపేట డిసిసి మాజీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అంతకుముందు బైక్ ర్యాలీని గ్రామంలో పురవీధుల గుండా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు సూర్య మోహన్ రెడ్డి, గొల్ల కృష్ణయ్య, మండల పార్టీ అధ్యక్షుడు బెలగుంది వీరన్న, పట్టణ అధ్యక్షుడు హరీష్ కుమార్, నాయకులు రామన్ గౌడ్, ధన్వాడ సింగల్ విండో అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, టైసన్, గోవర్ధన్, నర్సింలు, చెన్నయ్య, శ్రీనివాసులు, రఘుపతి రెడ్డి, మాజీ ఎంపీటీసీ గోపాల్, మంగలి రఘు, గొల్ల రాజు, పెంట మీద సత్యన్నా, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కాటకొండ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు