మరికల్, జూలై 14: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేస్తుండడం పట్ల మరికల్లో (Marikal) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పరిణికా రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు సూర్య మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బెలగొంది వీరన్న మాట్లాడుతూ బీసీలు రాజకీయంగా ఎదిగేందుకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసేందుకు సిద్ధమవడం బీసీల పట్ల కాంగ్రెస్కు ఉన్న నిబద్ధతకు నిదర్శనం అన్నారు.
రాజకీయంగా బీసీలు ఉన్నత స్థానంలో నిలిచేందుకు ఈ రిజర్వేషన్లు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు హరీష్ కుమార్, మాజీ ఎంపీటీసీ గోపాల్, నాయకులు లంబడి రాములు,రామకృష్ణ, గోవర్ధన్, టైసన్, మంగలి రఘు, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కాటకొండ ఆంజనేయులు, శ్రీనివాసులు, గొల్ల రాజు, చెన్నయ్య, నాగరాజు, పెంట మీద రఘు, సూర్య ప్రకాష్, సురేందర్ గౌడ్, ఆనంద్, మేస్త్రి కురుమన్న, జంగిడి రవి తదితరులు పాల్గొన్నారు.