నారాయణపేట, జనవరి 1 : నూతన సంవత్సరంలో జి ల్లా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం పట్టణంలోని పోలీస్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా ని ర్వహించారు. ఎస్పీ కేక్ కట్ చేసి పోలీస్ శాఖ తరఫున ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ప్రజలు పోలీస్‌స్టేషన్‌కు వస్తే కచ్చితంగా న్యాయం జరుగుతుందని భరోసా కల్పించేలా సిబ్బంది ప ని చేయాలని సూచించారు. పోలీస్‌శాఖ గౌరవాన్ని పెంచే లా ముందుకు సాగాలన్నారు. గతేడాది స్ఫూర్తితో మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు.
యోగా అవసరం
పోలీసులు వృత్తిరీత్యా ఎదురయ్యే ఒత్తిడులను తట్టుకునేందుకు యోగా ఉపయోగపడుతున్నదని ఎస్పీ అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ‘యోగా సంజీవిని సంపూర్ణ అష్టాంగ యోగా సాధన’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక, మానసికం గా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా సాధన ప్రతిఒక్కరి జీవనశైలిలో భాగం కా వాలన్నారు. పుస్తకాన్ని పోలీసులు, టీచర్లు, వ్యాయామ ఉపాధ్యాయులకు అందజేశామన్నారు. ప్రజలకు యోగాపై అవగాహన కా ర్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ భరత్, డీఎస్పీ మధుసూదన్‌రావు, సీఐలు శ్రీకాంత్‌రెడ్డి, శంకర్, శివకుమార్, జనార్దన్, ఆర్ఐ కృష్ణయ్య, ఎ స్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీని కలిసిన నాయకులు
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ వెంకటేశ్వర్లును శనివారం ఎస్పీ కార్యాలయంలో బీజేపీ మున్సిపల్ పోర్లీడర్ సత్యరఘుపాల్తోపాటు కౌన్సిలర్లు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నందూనామాజీ, రాము, కమలాపూర్ శ్రీనివాస్, విజయ్, కౌన్సిలర్లు అనూష, ప్రమీలాబాయి, శ్వే త, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ధన్వాడ మండలంలో..
ధన్వాడ, జనవరి 1 : ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వెంకటేశ్వర్లును శనివారం కొందరు టీఆర్ఎస్ నాయకులు ఎస్పీ ని కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించి నూతన ఏడాది శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు సు నీల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు సచిన్, ప్రధానకార్యదర్శి నర్సింహ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.