నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 21 : వ్యాక్సిన్ వేసుకొని కరోనా వైరస్ బారిన పడకుండా రక్షణ పొందాలని టీ ఆర్ఎస్ సీనియర్ నాయకుడు సుభాశ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని 2వ వార్డులో సిబ్బంది ఇంటింటికీ తిరి గి వార్డు ప్రజలకు వ్యాక్సిన్‌ను వేశారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఆయన మాట్లాడు తూ 18 ఏండ్లు పూర్తయిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, ఆశ వ ర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
ముమ్మరంగా టీకా
దామరగిద్ద, సెప్టెంబర్ 21 : మండలంలోని పలు గ్రా మాల్లో టీకా కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నది. గడిమున్కన్పల్లి గ్రామాన్ని ఎంపీపీ బక్క నర్సప్ప సందర్శించి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాన్ని వందశాతం టీ కా వేసుకునే విధంగా చేసి కొవిడ్ రహిత మండలంగా తీర్చిదిద్ద్దడానికి ప్రజల సహకారం కూడా కావాలని అన్నారు. దామరగిద్ద ఎస్బీఐ బ్యాంకు ఆవరణలో మేనేజర్ రవి ఖా తాదారులకు టీకా వేయించారు. కార్యక్రమంలో ఎంపీవో రామన్న, సర్పంచ్ సుభాశ్, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
టీకా కేంద్రం పరిశీలన
నర్వ, సెప్టెంబర్ 21 : మండలంలోని పాతర్చేడ్, లం కాల, నర్వ తదితర గ్రామాల్లో కొనసాగుతున్న టీకా పంపి ణీ కార్యక్రమాన్ని ఎంపీడీవో రమేశ్‌కుమార్ పరిశీలించారు. ప్రతిఒక్కరూ టీకా వేసుకునేలా గ్రామ ప్రజాప్రతినిధులు, సంబంధిత సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గ్రా మాల్లో ఇంటింటికీ వెళ్లి పంచాయతీ సిబ్బంది టీకా వేసుకొ ని వారికి టీకా గురించి ఆవగాహన కల్పించి, వేసుకునేలా చూడాలని సూచించారు.
వ్యాక్సిన్‌పై అపోహలు వీడాలి
కృష్ణ, సెప్టెంబర్ 21 : వ్యాక్సిన్‌పై ప్రజలు అపోహలు వీ డి ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలని డాక్టర్ శ్రీమంత్ అన్నారు. మండలంలోని ఆలంపల్లి, మూడుమాల, గుడెబల్లూర్, హిందూపూర్ తదితర గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి అ య్యే విధంగా కృషి చేయాలన్నారు. అయితే ఆనంపల్లిలో వ్యాక్సిన్ వందశాతం పూర్తి కావడంతో మండల ప్రత్యేకాధికారి యతిరాజ్, ఎంపీడీవో శ్రీనివాసులు, మెడికల్ ఆఫీసర్ శ్రీమంత్తో కలిసి సర్పంచ్ రామకృష్ణకు, వైద్య సిబ్బందికి, అంగన్వాడీ టీచర్లకు, ఆశ కార్యకర్తలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది, పంచాయతీ కా ర్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.