ధన్వాడ, అక్టోబర్ 8 : శరన్నవ రాత్రి ఉత్సవాల సందర్భం గా మండలంలోని అంభాభవాని ఆలయంలో రెండో రోజు అ మ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గ్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అ దేవిధంగా రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతను గాయత్రీదేవిగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, పటేల్ న ర్సింహులు, ఎర్ర బాలరాజు, సతీశ్‌కుమార్, శ్రీశైలం, యువకు లు పాల్గ్గొన్నారు.
ఘనంగా కుంకుమార్చన
శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక ఆంజనేయస్వామి ఆలయం, భ్రమరాంబికామల్లికార్జున ఆలయం, అప్పంపల్లిలో ఘనంగా మహిళలు కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సం ఘం నాయకుడు వీరశైవలింగాయత్, నాయకులు, అప్పంపల్లి, ఎలిగండ్ల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు
మండలకేంద్రంలోని లక్ష్మీవేంకటేశ్వరస్వా మి ఆలయంలో శరన్నవ రాత్రి ఉత్సవాల సందర్భంగా నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన నాగరాజుయాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పండితులు ఆయనకు స్వామివారి చిత్రపటం అందజేశారు. అనంతరం గుడెబల్లూర్ గ్రామానికి చెందిన కళాకారుడు ఎస్సైకి చిత్రపటాన్ని అంజేశారు. కార్యక్రమం లో అర్చకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
శరన్నవ రాత్రి ఉత్సవాలు
శరన్నవ రాత్రి ఉత్సవాలు పట్టణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప లు ఆలయాల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని నగరేశ్వర ఆలయంలో వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు బాలాత్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శక్తిపీఠంలో అమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శినమిచ్చా రు. మహంకాళి ఆలయంలో అమ్మవారి మూలవిరాట్టుకు పం చామృతాభిషేకం, మహామంగళహారతి కార్యక్రమాలు నిర్వ హించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తులు అమ్మవారి కి చీరె, గాజులు, పసుపు, కుంకుమ నైవేద్యాలు సమర్పించారు. సరాఫ్ బజార్, మడిఈశ్వర్ మందిర్‌లో ప్ర తిష్ఠించిన దుర్గామాత విగ్రహాలకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
నర్వ మండలంలో
మండలంలోని పలు గ్రామాల్లో శరన్నవ రాత్రి ఉ త్సవాల్లో భాగంగా దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించారు. మండపాలను అందంగా అలంకరించి దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నా రు. భక్తులు అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించి సకాలంలో వర్షాలు కురిసి పంట దిగుబడులు అధికంగా వచ్చి ప్రజలందరిపై ఆశీర్వాదాలు ఉండాలని ప్రార్థించారు.
మహాలక్ష్మీదేవిగా అమ్మవారు
మండలంలోని కోటకొండ నగరేశ్వర ఆలయంలో వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సం ఘం సభ్యులు, మహిళలు, చిన్నారులు, గ్రామస్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే సింగారం భవానీమాత ఆలయంలో అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.