నారాయణపేట టౌన్, అక్టోబర్ 8 : రంగు రంగుల పూ లను కూర్చి పేర్చి తయారు చేసిన బతుకమ్మ భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నమని ప్రిన్సిపాల్ మెర్సీ వసంత అన్నారు. శుక్రవారం పట్టణంలోని చిట్టెం నర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణలో అధ్యాపకులు, విద్యార్థినీలతో కలిసి బతుకమ్మలతో పాటలు పాడి నృత్యాలు చేశారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు లక్ష్మణాచారి, భాస్కర్‌రెడ్డి, సం ధ్యారాణి, ఎన్సీసీ అధికారి శంకర్ పాల్గొన్నారు. అదేవిధం గా స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు, విద్యార్థులు బతుకమ్మలను తయారు వివి ధ పాటలకు నృత్యాలు చేశారు. ప్రిన్సిపాల్ పద్మ బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియజేశారు. కార్యక్రమంలో ఎన్సీసీ వలంటీర్లు, యాజమాన్య సభ్యులు, అధ్యాపకు లు పాల్గొన్నారు. శ్రీసాయి స్కూల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకొన్నా రు. కార్యక్రమంలో నిర్వాహకులు శేషమ్మ, కవిత, భగవంత్‌రెడ్డి, ప్రిన్సిపాల్ శశికాంత్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. బారంబావి వద్ద జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముద్ద పప్పు బతుకమ్మ వేడుకల్లో జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ పాల్గొన్నారు. ఆ శాఖ అ ధికారులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తయా రు చేసి ఆడిపాడారు. జెడ్పీ సీఈవో సిద్ధి రామప్ప, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
ఘనంగా బతుకమ్మ సంబురాలు
మండలంలోని గుడెబల్లూర్ మార్గదర్శి విద్యాలయంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించా రు. విద్యార్థులు తీరొక్క పూలతో బతుకమ్మను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. బతుకమ్మను మధ్యలో ఉంచి పా టలు పాడుతూ నృత్యాలు చేస్తూ గంగమ్మ ఒడికి చేర్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థలు, ప్రజలు తది తరులు పాల్గొన్నారు.
ఎంపీడీవో కార్యాలయంలో…
ఎంపీడీవో కార్యాలయంలో ఎం పీపీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ విజయలక్షి అధ్యక్షతన మహిళలు బ తుకమ్మ ఆడారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.