మరికల్, జూలై 27 : ఆడబిడ్డల పెండ్లి కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవే శపెట్టిన ఘనంగా కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి, చి ట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తిరుమల ఫంక్షన్ హాల్లో మండలానికి చెందిన 58 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ ప్రభుత్వం ప్రతి గడపకు సంక్షేమ పథకాలను అందజేస్తుందని పేర్కొన్నారు. బిడ్డ పుట్టినప్పటి నుంచి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అం దించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్త్తుందన్నా రు. కులం, మతం, జాతి తేడా లేకుండా అందరి కీ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని అందజేస్తున్నారన్నారు. అలాగే సీఎం సహాయ నిధి కింద లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
రెవెన్యూ అధికారులపై ఆగ్రహం
కొంత కాలంగా రేషన్ కార్డుల కోసం లబ్ధిదారులు ఎదురుస్తున్నారని, కార్డులను ప్రభుత్వం అందజేస్తున్న లబ్ధిదారులకు ఎందుకు సమాచా రం ఇవ్వలేదని రెవెన్యూ అధికారులపై ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ కార్డులను ప్రజలకు అందించడం రెవెన్యూ అధికారులకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. తాసిల్దార్ కార్యాలయం మొత్తం అవినీతి కార్యాలయం గా మారిందని ఆగ్రహించారు. రేషన్ కార్డుల పం పిణీ కార్యక్రమం మధ్యలోనే నిలిపివేశారు. లబ్ధిదారులకు సమాచారం ఇచ్చాకే కార్డులను పంపిణీ చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. మొత్తం 259 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు మంజూరు కాగా కేవలం 12 మందికి మాత్రమే సమాచారం ఇచ్చి కార్యక్రమానికి వారు రావడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు
మండల తాసిల్దార్ కార్యాలయంలో అధికారు లు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని వారిపై చ ర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి కలెక్టర్ హరిచందనకు ఫిర్యాదు చేశారు. మండలంలో 259 రేషన్ కార్డులు మంజూరు కాగా కేవ లం 12 మంది మాత్రమే కార్డులు తీసుకోవడానికి రావడంతో ఎమ్మెల్మే బిత్తరపోయారు. వెంటనే తాసిల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందిని విషయం అడుగగా స్టేజిపై ఉన్న నాయకులు ఎవరికీ సమాచారం ఇవ్వలేదు సార్.. అందుకే ఎ వరు రాలేదని ఎమ్మెల్యేకు తెలియజేశారు.
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్
టీఆర్ఎస్ పార్టీ కార్యాకర్తలకు అండగా ఉం టుందని ఎమ్మెల్యేలు అన్నారు. ఇటీవల రోడ్డు ప్ర మాదంలో మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి రెండు లక్షల ప్రమాద బీమా చెక్కులను మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.
కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ సురేఖారెడ్డి, ఎంపీపీ శ్రీకళారాజవర్ధన్రెడ్డి, వైస్ ఎంపీపీ రవికుమార్, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు వాహీద్, స ర్పంచ్ గోవర్థన్, ఎంపీటీసీలు, విండో చైర్మన్లు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
పేదల కోసమే కల్యాణలక్ష్మి
పేదల సంక్షేమం కోసమే ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే రాజేందర్‌రె డ్డి అన్నారు. ధన్వాడ రైతువేదిక భవనంలో క ల్యాణలక్ష్మి చెక్కులు, కొత్త రేషన్ కార్డులను లబ్ధి దారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడేండ్ల కాలంలోనే పేదల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. కల్యాణలక్ష్మి పథకంతో ఎంతో మంది ఆడబిడ్డల పెండ్లి ఖర్చులు లేకుండా చేశామన్నారు. అంతేకాక రేషన్‌కార్డులు ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అమరేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు ఉమేశ్కూమార్, మాధవితోపాటు పలువురు పాల్గొన్నారు.