నారాయణపేట, నవంబర్ 1 : పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరిచందన అధ్యక్షతన అఖిల పక్ష నాయకుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో అటవీ రక్షణ, హరితహారంపై చ ర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా లో రెండు మండలాల్లో పోడు భూములు ఉన్నాయని, రెవె న్యూ, అటవీ శాఖల అధికారులు సర్వే నిర్వహించాలని ఆదేశించారు. సర్వే అనంతరం గ్రామాల్లో సమావేశాలు ఏర్పా టు చేసి గ్రామ కమిటీల నియామకం చేపట్టాలన్నారు. గ తంలో పోడు భూముల సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆర్వోఆర్, భూ రికార్డులో పేరు ఉన్న వారికి హ క్కు పత్రాలు అందజేశామన్నారు. పలువురు అఖిల పక్ష నా యకులు మాట్లాడుతూ అడవి బిడ్డలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అనంతరం అటవీ భూములను కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, అటవీశాఖ అధికారి గంగిరెడ్డి, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
వాల్‌పోస్టర్ విడుదల
మండలంలోని అప్పిరెడ్డిపల్లి రాందేవుడి గుట్టపై సీతారామ దేవస్థానం ఆలయ పునర్ నిర్మాణం చేపడుతున్నారు. అందులో భాగంగా ఆలయానికి సంబంధించి నిధుల సేకరణకు వాల్‌పోస్టర్లను పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి విడుదల చేశా రు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చై ర్మన్ జగదీశ్, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్‌సాగర్, ప్రధానకార్యదర్శి చెన్నారెడ్డి, నాయకులతోపాటు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదుగాలి
మహిళా సంఘాల సభ్యులు సొంతంగా వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థికంగా బలోపే తం కావాలని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి స్పష్టంచేశారు. సోమవారం మండలంలోని సింగారంలో చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగరబత్తుల తయారీ కేం ద్రాన్ని కలెక్టర్ హరిచందనతో కలిసి ప్రారంభించారు. కేం ద్రంలోని అగరబత్తుల తయారీ యంత్రాన్ని పరిశీలించి అ గరబత్తులు తయారు చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నా రు. అగరబత్తులను అరుణ్య బ్రాండ్ ద్వారా విక్రయిస్తామ ని సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు వివరించారు. కార్యక్రమంలో డీఆర్డీవో గోపాల్‌నాయక్, జెడ్పీటీసీ అంజలి, ఎం పీపీ శ్రీనివాస్‌రెడ్డి, సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
బాలభవన్ ప్రారంభం
పట్టణంలోని మినీ స్టేడియంలో నూతన బాలభవన్‌ను సోమవారం గరికపాటి మోహన్‌రావు, ఎమ్మెల్యే ఎస్.రా జేందర్‌రెడ్డి, కలెక్టర్ హరిచందనలతో కలిసి ప్రారంభించా రు. ఇప్పటికే బాలభవన్ బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతుండగా, మినీ స్టేడియంలో ఉన్న ఓ భవనానికి గరికపాటి కృష్ణ మోహన్, ప్రదీప్ మెమోరియల్ ట్రస్ట్ దాతలు మరమ్మతులు చేయించి ప్రారంభించారు.
ట్రస్ట్ సభ్యులకు ఎమ్మెల్యే, కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీఈవో లియాఖత్ అలీ, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, బాలభవన్ నిర్వాహకులు మహిపాల్‌రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.