నారాయణపేట, సెప్టెంబర్ 11 : టీఆర్ఎస్ పార్టీ కోసం పని చేసే వారికి సముచిత స్థానం ఉంటుందని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని పార్టీ కార్యాలయంలో శనివారం పట్టణ వార్డులు, గ్రామ కమిటీల ఏర్పాటు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మట్లాడుతూ కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమని అన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని తీసుకొచ్చిన ఘనత ఒక్క గులాబీ కండువా కు మాత్రమే ఉందన్నారు. వార్డు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను స్వయంగా తానే ఎంపిక చేస్తానన్నారు. వార్డు అ ధ్యక్షుడు తప్పని సరిగా వార్డులో పర్యటించాలన్నారు. పార్టీలోని యువత క్రియాశీలంగా వ్యవహరించాలని సూచించారు. సోషల్ మీడియా సభ్యులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, పార్టీ ప్రతి కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. పార్టీపై చేసే దుష్ట్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. రాబో పు 20 ఏండ్లు కేసీఆర్ సీఎంగా ఉంటారన్నారు. కార్యక్ర మంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నా యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే బాధిత కు టుంబ సభ్యులకు అందజేశారు. పట్టణానికి చెందిన గీతజగదీశ్కు రూ.60వే లు, పద్మాబాయి నారాయణరావుకు రూ.27వేలు, అప్పిరెడ్డిపల్లికి చెందిన వెంకటప్పకు రూ.24వేలు, చిన్నజట్రంకు చెందిన కృష్ణయ్య కు రూ.22వేలు, జలాల్‌పూర్‌కు చెందిన వెంకట్రాములుకు రూ.53వేలు, జాజాపూర్‌కు చెందిన కె.రాజేందర్‌కు రూ. 60వేలు, జాజాపూర్‌కు చెందిన కాట్రే నర్సమ్మకు రూ.44 వేలు, అప్పిరెడ్డిపల్లికి చెందిన మోహన్‌రెడ్డికి రూ.60వేలు, సింగారంకు చెందిన అనంతయ్యగౌడ్కు రూ.22వేలు, జ లాల్పూర్కు చెందిన కె.నారాయణరెడ్డికి రూ.24వేలు, లిం గంపల్లికి చెందిన బాలప్పకు రూ.60వేలు, అంత్వార్‌కు చెం దిన అనూషకు రూ.10,500లు, లక్ష్మీపూర్‌కు చెందిన నిఖితకు రూ.24వేలు విలువ చేసే చెక్కులను అందజేశారు. సీ ఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఒక్క కుటుం బం లబ్ధిపొందుత్తున్నారన్నారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చై ర్మన్ నర్సింహారెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ అంజ లి, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, వైస్ చైర్మన్ హరినారాయణబట్టడ్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, వా ర్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.