అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
బుధవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, సీనియర్ సిటిజన్ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల ఆర్థిక పునరావాసం కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
- నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్నారాయణపేట, సెప్టెంబర్ 20 : అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, సీనియర్ సిటిజన్ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల ఆర్థిక పునరావాసం కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో లబ్ధిదారుడికి రూ.2,50లక్షల చొప్పున ఐదు మంది దివ్యాంగులకు అందించడం జరిగిందన్నారు.
ఎల్వోసీ అందజేత..
కోయిల్‌కొండ మండలం పారుపల్లికి చెందిన చెన్నమ్మకు చికిత్స కోసం రూ. లక్షా 25వేలు, నారాయణపేటకు చెందిన నింగప్పకు చికిత్స కోసం రూ.లక్ష ఎల్వోసీలను బుధవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి బాధిత కుటుంబ
సభ్యులకు అందజేశారు.
అండగా ఉంటాం..ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఉషనప్ప రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందాడు. ఉషనప్ప కుటుంబానికి రూ.2లక్షల ప్రమాద బీమా మంజూరైంది. బుధవారం ఎమ్మెల్యే ఉషనప్ప ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రమాద బీమా చెక్కును అందజేశారు. అలాగే ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా మేదర మహేంద్ర సంఘం వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

